ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. హాజరు విషయంలో ఒత్తిడి ఉండదు.. స్పష్టం చేసిన మంత్రి సబితా

|

Jan 18, 2021 | 3:34 PM

తెలంగాణలో బడి గంట మోగనుంది. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో విద్యాసంస్థలు, గురుకులాలు, హాస్టల్స్ తెరవడంపై పరిస్థితులను....

ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. హాజరు విషయంలో ఒత్తిడి ఉండదు.. స్పష్టం చేసిన మంత్రి సబితా
Follow us on

Telangana Schools: తెలంగాణలో బడి గంట మోగనుంది. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో విద్యాసంస్థలు, గురుకులాలు, హాస్టల్స్ తెరవడంపై పరిస్థితులను విశ్లేషించడానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సమీక్షా సమావేశం నిర్వహించి.. అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యాసంస్థలు ప్రారంభించేందుకు ఈనెల 25లోపు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్లాస్ రూమ్‌లో విద్యార్థుల మధ్య కనీసం ఆరడుగుల దూరం ఉండాలన్నారు.

విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఆందోళన వద్దని.. వారి భవిష్యత్ గురించి కూడా ఆలోచించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తల్లిదండ్రులకు సూచించారు.  ఫిబ్రవరి 1 నుంచి 9వ తరగతి నుంచి ఆపై కోర్సులకు తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. పుస్తకాలు, యూనిఫారాలు ఇప్పటికే చేరవేసినట్లు చెప్పారు. మంగళవారం జరగనున్న సమావేశానికి తల్లిదండ్రుల కమిటీని ఆహ్వానించినట్లు వివరించారు. విద్యార్థుల హాజరు విషయంలో ఎలాంటి ఒత్తిడి ఉండదని స్పష్టం చేశారు.  వసతి గృహాలలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Also Read :

బోయినపల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియకు చుక్కెదురు.. బెయిల్ విషయంలో మళ్లీ నిరాశే

సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఝలక్.. ఇతర పార్టీల్లో చేరుతున్న అభిమానులు..అధిష్టానం స్పందన ఏంటంటే..?