ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్

| Edited By:

Jun 03, 2019 | 9:58 AM

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు జోరందుకుంది. మూడుకు మూడు ఎమ్మెల్సీ సీట్లు గెలిచి టీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. నల్గొండ, వరంగల్, రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నప్పరెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. వరంగల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. వరంగల్‌లో టీఆర్ఎస్‌కు 850, కాంగ్రెస్‌కు 23 […]

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్
Follow us on

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు జోరందుకుంది. మూడుకు మూడు ఎమ్మెల్సీ సీట్లు గెలిచి టీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. నల్గొండ, వరంగల్, రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నప్పరెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. వరంగల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. వరంగల్‌లో టీఆర్ఎస్‌కు 850, కాంగ్రెస్‌కు 23 ఓట్లు వచ్చాయి. భారీ ఆధిక్యతతో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. ఉమ్మడి రంగారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి మహేందర్ రెడ్డి విజయం సాధించారు.