గుప్త నిధుల వేటలో హైటెక్ ట్రెండ్!

|

Aug 11, 2019 | 1:42 AM

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో గుప్త నిధుల వేట కలకలం సృష్టించింది.  కొందరు అనుమానితులు గుప్త నిధుల కోసం అన్వేశిస్తుండగా..  స్థానికులు పట్టుకోని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. నల్లమల అటవీ ప్రాంతంలోని రాయలగండి గుట్ట సమీపంలో కొందరు వ్యక్తులు కొన్ని అధునాతన యంత్రాల సాయంతో గుప్త నిధుల వేట సాగించారు. ఈ క్రమంలో స్థానికులు ఇక్కడ ఏం పనిచేస్తున్నారని అడ్డగించారు. అనుమానంతో వారి కారును తెరిచి చూడగా అందులో ఒక భూగర్భంలో నిధులను గుర్తించే రిమోట్ […]

గుప్త నిధుల వేటలో హైటెక్ ట్రెండ్!
Follow us on

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో గుప్త నిధుల వేట కలకలం సృష్టించింది.  కొందరు అనుమానితులు గుప్త నిధుల కోసం అన్వేశిస్తుండగా..  స్థానికులు పట్టుకోని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. నల్లమల అటవీ ప్రాంతంలోని రాయలగండి గుట్ట సమీపంలో కొందరు వ్యక్తులు కొన్ని అధునాతన యంత్రాల సాయంతో గుప్త నిధుల వేట సాగించారు. ఈ క్రమంలో స్థానికులు ఇక్కడ ఏం పనిచేస్తున్నారని అడ్డగించారు. అనుమానంతో వారి కారును తెరిచి చూడగా అందులో ఒక భూగర్భంలో నిధులను గుర్తించే రిమోట్ మెటల్ డిటెక్టర్ యంత్రం, కొన్ని రసాయనాలు ఉన్నాయి. అయితే వెంటనే అక్కడి స్థానికులు వారిని బంధించి పోలీసులకు అప్పగించారు. కాగా వారిని రంగారెడ్డి జిల్లాకు చెందిన వెంకటేశ్‌సాగర్, హైదరాబాద్‌కు చెందిన శ్యామ్‌సుందర్‌రావు, అక్షయ్‌రావు, హరిప్రసాద్‌రావు, వంగూర్ మండలానికి చెందిన లక్ష్మారెడ్డిలుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.