ఉత్తమ్ రాజీనామా: సీఎల్పీ విలీనంపై తెరాస దూకుడు!

| Edited By:

Jun 04, 2019 | 4:44 PM

సీఎల్పీ విలీనంపై టిఆర్ఎస్ దూకుడుగా ఉంది. నల్గొండ ఎంపీగా ఎన్నికైన ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి త్వరలో రాజీనామా చేయనున్నారు. ఉత్తమ్ రాజీనామా చేసిన వెంటనే టిఆర్ఎస్ లో కాంగ్రెస్ శాసనసభా పక్షం విలీనం చేసేందుకు రంగం సిద్ధమౌతోంది. ఉత్తమ్ రాజీనామా అనంతరం కేవలం ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆరెస్ లో చేరితే విలీనం సులభమవుతుంది. స్థానిక సంస్థల ప్రక్రియ ముగియగానే అసెంబ్లీలో కాంగ్రెస్ ను ఖతం చేసే వ్యూహానికి గులాబీదళం పదునుపెడుతోందని […]

ఉత్తమ్ రాజీనామా: సీఎల్పీ విలీనంపై తెరాస దూకుడు!
Follow us on

సీఎల్పీ విలీనంపై టిఆర్ఎస్ దూకుడుగా ఉంది. నల్గొండ ఎంపీగా ఎన్నికైన ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి త్వరలో రాజీనామా చేయనున్నారు. ఉత్తమ్ రాజీనామా చేసిన వెంటనే టిఆర్ఎస్ లో కాంగ్రెస్ శాసనసభా పక్షం విలీనం చేసేందుకు రంగం సిద్ధమౌతోంది. ఉత్తమ్ రాజీనామా అనంతరం కేవలం ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆరెస్ లో చేరితే విలీనం సులభమవుతుంది. స్థానిక సంస్థల ప్రక్రియ ముగియగానే అసెంబ్లీలో కాంగ్రెస్ ను ఖతం చేసే వ్యూహానికి గులాబీదళం పదునుపెడుతోందని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో ఇప్ప‌టికే ప‌ది మంది ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, బానోతు హరిప్రియా నాయక్, చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, కందాళ ఉపేందర్ రెడ్డి, వనమావెంకటేశ్వర్ రావు, సుధీర్ రెడ్డి, జాజుల సురేందర్ పార్టీ మారిన వారిలో ఉన్నారు. మ‌రో ముగ్గురు నేత‌లు టీఆర్ఎస్ బాటపట్టినట్లు స‌మాచారం.