ఐదు నిమిషాల్లో బీభత్సం సృష్టించిన టోర్నడో..

| Edited By:

Apr 17, 2019 | 10:10 AM

పెద్దపల్లి గోదావరిఖనిలోని సింగరేణి స్టేడియం గ్రౌండ్‌లో సుడిగాలి టోర్నడోను తలపించింది. అనూహ్యంగా నలుదిక్కుల నుండి వేగంగా వీచిన గాలి సుడిగాలిలా మారింది. గ్రౌండ్‌లో ఒక్కసారిగా దుమ్ము, ధూళితో సుడి తిరుగుతూ భీకరంగా మారింది. హఠాత్తుగా చోటుచేసుకున్న ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు ఐదు నిమిషాలపాటు ఈ సుడిగాలి ఆ ప్రాంతంలో బీభత్సం సృష్టించింది. ఈ అరుదైన దృశ్యాన్ని స్థానికులు కొందరు సెల్‌ఫోన్లో బంధించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. […]

ఐదు నిమిషాల్లో బీభత్సం సృష్టించిన టోర్నడో..
Follow us on

పెద్దపల్లి గోదావరిఖనిలోని సింగరేణి స్టేడియం గ్రౌండ్‌లో సుడిగాలి టోర్నడోను తలపించింది. అనూహ్యంగా నలుదిక్కుల నుండి వేగంగా వీచిన గాలి సుడిగాలిలా మారింది. గ్రౌండ్‌లో ఒక్కసారిగా దుమ్ము, ధూళితో సుడి తిరుగుతూ భీకరంగా మారింది. హఠాత్తుగా చోటుచేసుకున్న ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు ఐదు నిమిషాలపాటు ఈ సుడిగాలి ఆ ప్రాంతంలో బీభత్సం సృష్టించింది. ఈ అరుదైన దృశ్యాన్ని స్థానికులు కొందరు సెల్‌ఫోన్లో బంధించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.