Suryapet: తాటిచెట్టు పైకి ఎక్కి ఉరేసుకున్న వృద్ధుడు.. మృతదేహాన్ని దించుతుండగా.. ఊహించని విధంగా

|

Aug 03, 2024 | 12:17 PM

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురంలో విషాదం చోటు చేసుకుంది. తాటి చెట్టుకు ఉరేసుకొని ఓ కల్లు గీత కార్మికుడు తనువు చాలించాడు. అతడి మృతదేహాన్ని కిందకు దించే క్రమంలో.. మరో యువకుడు ప్రమాదానికి గురయ్యి తీవ్రంగా గాయపడ్డాడు.

Suryapet: తాటిచెట్టు పైకి ఎక్కి ఉరేసుకున్న వృద్ధుడు.. మృతదేహాన్ని దించుతుండగా.. ఊహించని విధంగా
Toddy Worker
Follow us on

సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన వెలుగుచూసింది. గీత కార్మికుడైన ఓ వృద్దుడు… తనకు ఇన్నాళ్లు జీవనోపాధిని ఇచ్చిన తాటిచెట్టు పైకి ఎక్కి ఉరేసుకొని తనువు చాలించాడు. అతడి మృతదేహాన్ని కిందకి దించుతుండగా మరో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముకుందాపురానికి చెందిన 75 ఏళ్ల దేశగాని వెంకటేశం.. కల్లు గీస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతను భార్యకు మతిస్థిమితం సరిగ్గా ఉండటం లేదు. ఆర్థిక సమస్యలు కూడా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయా కారణాలతో.. శుక్రవారం కల్లు తీసేందుకు గ్రామ శివారుకి వెళ్లి.. తాటిచెట్టు ఎక్కి ఉరేసుకున్నాడు. అటుగా వెళ్తున్నవారు.. తాటిచెట్టుకు వెంకటేశం వేలడటాన్ని గమనించారు. వెంటనే విషయాన్ని గ్రామస్తులకు ఫోన్ చేసి విషయం చెపపారు. సుమారు 50 అడుగుల ఎత్తులో వెంకటేశం చెట్టుకు వేలాడుతూ ఉండగా.. పోలీసుల సమక్షంలోనే అతడిని కిందకు దించే ప్రయత్నం చేశారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే మృతదేహాన్ని కిందకు దించే సమయంలో అనుకోని ప్రమాదం జరిగి..  ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంకటేశం మృతదేహం కిందకు దించే యత్నంలో భాగంగా గ్రామానికి చెందిన యువకుడు పూర్తిగా చెట్టు ఎక్కాడు. మరో యువకుడు నాగార్జున తాడు సాయంతో చెట్టు మధ్య వరకు చేరుకున్నాడు.

డెడ్‌బాడీని తాడు సాయంతో కిందకు దించుతుండగా.. అనూహ్యంగా తాడు తెగిపోయింది. దీంతో మృతదేహం చెట్టు మధ్యలో ఉన్న నాగార్జునపై ఒలంగా దూసుకొచ్చింది. దీంతో మృతదేహంతో పాటు వెంకటేశం కింద పడిపోయాడు. ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే కోదాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాగార్జున పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.