Telangana: అతని గెటప్ వెనుక చాలా మంచి ఉద్దేశం ఉంది.. ఏంటో తెలిస్తే శభాస్ అంటారు

|

Jan 01, 2022 | 4:28 PM

ఆస్పత్రి వెంటిలెటర్ పై ఉండాల్సిన పేషెంట్ పెళ్ళిలో ఉన్నాడనుకుంటున్నారా? అయితే, మీరు పొరబడినట్లే! అతని గెటప్‌ వెనుక చాలా మంచి ఉద్దేశం ఉంది.

Telangana: అతని గెటప్ వెనుక చాలా మంచి ఉద్దేశం ఉంది.. ఏంటో తెలిస్తే శభాస్ అంటారు
Green Man
Follow us on

ఆస్పత్రి వెంటిలెటర్ పై ఉండాల్సిన పేషెంట్ పెళ్ళిలో ఉన్నాడనుకుంటున్నారా? అయితే, మీరు పొరబడినట్లే! మొక్కలను కాపాడటానికీ, పర్యావరణ పరిరక్షణ కోసం ఇలా విచిత్ర వేషం కట్టి ఓ పెళ్ళికీ హాజరయ్యాడు. వధూవరులకు మొక్కను బహుమతిగా ఇచ్చాడు. అథితులందరికీ మొక్కల పెంపకం గురించి వివరించాడు. నేను చెప్పినట్లు చేయకపోతే, భవిష్యత్తులో మీ పరిస్థితి ఇలాగే ఉంటుందని చూపిస్తున్నాడు. కాస్త కన్ఫూజన్‌గా ఉందికదా..ఇదంతా ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలంలోని నర్సుగూడెం గ్రామంలో జరుగుతున్న ఓ వివాహ కార్యక్రమానికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, వన ప్రేమికుడు డాక్టర్‌ పుల్సం సాంబయ్య తన గ్రీన్‌ ఆక్సిజన్‌ గెటప్‌తో ఇలా వెరైటీగా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, మొక్కను గిఫ్ట్ గా అందచేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అనంతరం పెళ్లికి హాజరైన అతిథులకు పర్యావరణ పరిరక్షణ కోసం, భవిష్యత్ తరాలకు మంచి స్వచ్ఛమైన ఆక్సీజన్ ను అందించి పరిపూర్ణమైన ఆరోగ్యమైన, సుఖవంతమైన జీవనం సాగించాలంటే ప్రతీ ఒక్కరు మొక్కలను విరివిగా నాటి పరిరక్షణ కోసం పాటుపడాలన్నారు.

మానవుడు తన స్వార్థ, ఆర్థిక ప్రయోజనాల కోసం అడవులను విచక్షణారహితంగా నరికి నాశనం చేయడం వల్ల అడవులు అంతరించిపోతున్నాయన్నారు. కాబట్టే తనవంతు బాధ్యతగా ప్రేమతో అడవులను, వన్య మృగాలను కాపాడుకునేందుకు పాటుపడితే జీవ వైవిధ్యం సమృద్ధిగా ఉంటుందని డాక్టర్ పుల్సం సాంబయ్య అవగాహన కల్పించారు. ఇటీవల ఈ గెటప్ తో మహబూబాబాద్ జిల్లా మొత్తం పర్యటించాడు. సెలవులు వస్తే చాలు, ఈ గెటప్ తో ఊరూరా తిరుగుతూ ప్రచారం చేయడం సాంబయ్యకు అలవాటు. భవిష్యత్‌ తరాల కోసం సాంబయ్య పడుతున్న తపన అభినందించాల్సిందే.

 

 

 

Also Read: Viral: సంచలనం.. ‘ప్లాస్టిక్‌ బిడ్డ’కి జన్మనిచ్చిన మహిళ.. ఇండియాలోనే

Jagtial: డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కోసం ఆపగా.. పోలీసులకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మందుబాబు