Telangana: తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని దారుణం.. అమ్మమ్మను కొట్టిన చంపిన కసాయి మనువడు

|

Jul 17, 2024 | 2:15 PM

ఖమ్మంలో దారుణం చోటు చేసుకుంది. కనీస మానవత్వం లేకుండా మనువడు సొంత అమ్మమ్మను కొట్టి చంపాడు. చెడు వ్యసనాలకు బానిసైన ఉదయ్ కుమార్, తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని గంజాయి మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడు. స్థానికులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతన్ని కఠినంగా శిక్షించాలని మృతురాలి బందువులు కోరుతున్నారు.

Telangana: తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని దారుణం.. అమ్మమ్మను కొట్టిన చంపిన కసాయి మనువడు
Crime News
Follow us on

ఖమ్మంలో దారుణం చోటు చేసుకుంది. కనీస మానవత్వం లేకుండా మనువడు సొంత అమ్మమ్మను కొట్టి చంపాడు. చెడు వ్యసనాలకు బానిసైన ఉదయ్ కుమార్, తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని గంజాయి మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడు. స్థానికులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతన్ని కఠినంగా శిక్షించాలని మృతురాలి బందువులు కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఖమ్మం నగరంలోని రోటరీ నగర్ లో సొంత అమ్మమ్మను మనువడు ఉదయ్ కుమార్ కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన అర్థ రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృ‌ష్టించింది. వృద్ధురాలు రాంబాయమ్మ(80) అక్కడికక్కడే మృతి చెందింది. రాంబాయమ్మకు ముగ్గురు కూతుళ్ళు, ఒక కుమారుడు ఉన్నారు. వారికి వివాహాలు కావడంతో వేరు వేరు చోట్ల స్థిరపడ్డారు. ఈమె భర్త అనారోగ్యంతో మరణించడంతో రోటరీ నగర్ లో ఒంటరిగా జీవిస్తోంది. హైదారాబాద్‌లో ఉండే కుమారుడు ఖర్చులు కోసం కొంత డబ్బు పంపుతూ ఉంటాడు. తనకు నెల నెలా వృద్ధాప్య పింఛన్ వస్తుంది.

అయితే, రాంబాయమ్మ చిన్న కుమార్తె కొడుకు ఉదయ్ కుమార్ తండ్రి చిన్నతనంలో మరణించాడు. తల్లి కూడా వేరే వివాహం చేసుకుంది. ఇతను ఖమ్మం లో వేరే చోట నివసిస్తున్నాడు. ప్రతి రోజూ తన అమ్మమ్మ దగ్గరకు వచ్చి తాగుడుకు డబ్బులు ఇవ్వాలని కోరుతూ గొడవ పడుతుంటాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడి, విపరీతంగా తాగుడు, గంజాయికి బానిసగా మారాడు. గంజాయి మత్తులో గొడవలు పెట్టుకోవడం, చుట్టు పక్కల వారిపై దూషిస్తు ఘర్షణకు దిగతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పలుసార్లు హెచ్చరించినా తన ప్రవర్తన లో మార్పు రాలేదని బందువులు అంటున్నారు.

ఎప్పటి లాగానే అమ్మమ్మ దగ్గరకు వచ్చి, తాగుడుకు డబ్బులు అడిగితే ఇవ్వలేదు. గంజాయి తాగి అర్ధరాత్రి ఇంటికి వెళ్లి అమ్మమ్మతో గొడవ పడుతూ.. మత్తులో విచక్షణ రహితంగా వృద్ధురాలిపై దాడికి తెగబడ్డాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు గమనించి అతన్ని పట్టుకుని దేహ శుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వృద్దురాలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు టూ టౌన్ పోలీసులు. హత్య చేసిన యువకుడుని అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు ఖమ్మం టూ టౌన్ పోలీసులు. నిందితుడు ను కఠినంగా శిక్షించాలని బందువులు ,స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…