TGPLRB: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్‌.. పోలీస్ ఉద్యోగాలపై మరో కీలక ప్రకటన!

తెలంగాణలోని నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. రాష్ట్రంలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, తాజాగా ఆ పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీని కూడా ప్రకటించింది. ఈ మేరకు శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

TGPLRB: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్‌.. పోలీస్ ఉద్యోగాలపై మరో కీలక ప్రకటన!
Tgprb Police Jobs Application Dates Released

Updated on: Aug 01, 2026 | 2:46 PM

రాష్ట్రంలో 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి గత వారం తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ పోస్టులకు సంబంధించి తాజాగా రిక్రూట్‌మెంట్ బోర్డ్ మరో కీలక ప్రకటన చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆగస్టు 19 ఉదయం 8 గంటల నుంచి ప్రారంభిస్తున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈ పోలీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

మొత్తం నాలుగు విభాగాల్లో సివిల్ కానిస్టేబుల్, SPF, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో ఉద్యోగాల భర్తీకి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రిక్రూట్‌మెంట్ బోర్డ్ మరో కీలక సూచన కూడా చేసింది. కేవలం www.tgprb.in, http://www.tgprb.in వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని, వీటి ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే దరఖాస్తు చేసుకోవడానికి ముందు Aadhaar App ద్వారా Aadhaar Face Authentication పూర్తి చేసుకోవాలని తెలిపింది.

పోస్టుల వారీగా దరఖాస్తు రుసుము

పోస్టు రకం SC / ST అభ్యర్థులకు ఇతరులకు
SI పోస్టులు ₹750 ₹1,500
కానిస్టేబుల్ పోస్టులు ₹600 ₹1,200

గమనిక: ఒకే PMT/PET ద్వారా బహుళ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే అదనపు దరఖాస్తులపై ఫీజు రాయితీ కూడా ఉంటుందని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పేర్కొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us