Weather: ఏపీ, తెలంగాణకు వచ్చే 2 రోజుల్లో అకాల వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు.. తాజా రిపోర్ట్ ఇదిగో

ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ చలి తీవ్రత శివరాత్రి నుంచి క్రమక్రమంగా తగ్గుతోంది. అలాగే పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. ఇక తెలంగాణలో ఫిబ్రవరి 22 ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో.. ఫిబ్రవరి 23, 24న హైదరాబాద్, వరంగల్, సిద్దిపేటలో.. వివరాలు ఇలా ఉన్నాయి

Weather: ఏపీ, తెలంగాణకు వచ్చే 2 రోజుల్లో అకాల వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు.. తాజా రిపోర్ట్ ఇదిగో
Andhra Pradesh Telangana Weather Forecast

Updated on: Feb 19, 2026 | 7:44 AM

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలెర్ట్ ఇచ్చింది. మరో రెండు రోజుల్లో వర్షాలు పడనున్నట్టు తెలిపింది. మొన్నటి వరకు చలి చంపేస్తే.. రెండు మూడు రోజుల నుంచి ఎండ ప్రభావం పెరుగుతోంది. ఈ తరుణంలో ఆకస్మికంగా వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని పేర్కొంది. ఈ నెల 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో ఈ నెల 21 నుంచి 3 రోజుల పాటు రాయలసీమలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. అలాగే 22వ తేదీ నుంచి 2 రోజుల పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పడతాయని చెప్పింది. అటు రానున్న 24 గంటల్లో కోస్తాలోని పలు జిల్లాల్లో పొగ మంచు కురుస్తుందని, ఎండ స్వల్పంగా పెరుగుతుందని పేర్కొంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ చలి తీవ్రత శివరాత్రి నుంచి క్రమక్రమంగా తగ్గుతోంది. అలాగే పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. ఇక తెలంగాణలో ఫిబ్రవరి 22 ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో.. ఫిబ్రవరి 23, 24న హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్, సూర్యపేట, భద్రాచలంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. 20-40 మి.మీ. వర్షపాతం ఉండవచ్చునని.. రైతులు పంటలు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మార్చి మొదటి వారం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొట్టే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us