Telangana: ఒకేసారి ఇంత మంది IPSలను బదిలీ చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏంటి?

తెలంగాణలో ఒకేసారి 21 మంది IPS అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, మహిళల భద్రత, అవినీతి నియంత్రణకు ప్రాధాన్యతనిస్తూ కీలక విభాగాలకు సీనియర్ అధికారులను నియమించింది. .. ..

Telangana: ఒకేసారి ఇంత మంది IPSలను బదిలీ చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏంటి?
Ips Transfers

Updated on: Nov 13, 2026 | 2:16 PM

తెలంగాణలో 21 మంది IPS‌ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. ఒకేసారి ఇంత మందిని బదిలీ చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? అంటే రెండు, మూడు అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
1. శాంతి, భద్రతలను అదుపులో ఉంచడం

2. ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం చూపడం

3. మహిళా భద్రత

4. హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెంచడం

ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇక నుంచి మరో ఎత్తు అన్నట్టుగా ముందుకు సాగుతోంది తెలంగాణ ప్రభుత్వం. అనుభవం ఉన్న IPSలకు కీలక బాధ్యతలు అప్పగించింది. తమకున్న సీనియారిటీ, అవగాహనతో ఆ వింగ్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాలని అనుకుంటున్నట్టు కనిపిస్తోంది. మహిళ భద్రతకు ప్రాధాన్యత, అవినీతిని కట్టడి చేయడమే అసలు లక్ష్యమని చెప్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరెవరికి ఏయే బాధ్యత అప్పగించారు? వారి నుంచి ప్రభుత్వం ఏం ఆశిస్తోంది.

హైదరాబాద్‌ సీపీగా మహేష్‌ భగవత్‌.. గతంలో రాచకొండ కమిషనర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు మహేష్ భగవత్. హైదరాబాద్‌లో శాంతి, భద్రతలను అదుపులోకి ఉంచేందుకు, కొత్త సమస్యలు రాకుండా ఉండేందుకు మహేష్‌ భగవత్‌కు హైదరాబాద్ సీపీ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో ప్రత్యేకంగా చూపించాలనుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో సమస్యలు లేని నగరంగా చూపేందుకు మహేష్ భగవత్‌కు ఆ బాధ్యత అప్పగించింది.

TMARS డైరెక్టర్‌గా‌ స్టీఫెన్ రవీంద్ర. తెలంగాణ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, రోడ్‌ అండ్‌ రైల్‌సేఫ్టీ బ్యూరో TG -TMARS మొదటి డైరెక్టర్‌గా సీనియర్‌ IPS‌ అధికారి స్టీఫెన్ రవీంద్రకు బాధ్యతలు అప్పగించారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్‌ పెట్టే రెస్పాన్సిబులిటీని స్టీఫెన్ రవీంద్రకు అప్పగించినట్టు తెలుస్తోంది. గతంలో కొన్ని ఇష్యూస్‌ను‌ సమర్థవంతంగా హ్యాండిల్ చేసిన అనుభవం ఆయనకు ఉంది. అందుకే ట్రాఫిక్‌ బాధ్యతను స్టీఫెన్ రవీంద్రకు అప్పగించారన్న అంచనాలున్నాయి

లా అండ్ ఆర్డర్‌ అడిషనల్ DGPగా అకున్ సబర్వాల్. రాష్ట్రాభివృద్ధిలో శాంతి, భద్రతలు అత్యంత కీలకం. అందుకే అకున్‌ సబర్వాల్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. గతంలో డ్రగ్స్‌ కేసు కూపీ మొత్తం లాగారు అకున్ సబర్వాల్. స్టిక్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఆయనకు పేరుంది. అందుకే లా అండ్ ఆర్డర్ అకున్ చేతిలో పెట్టింది ప్రభుత్వం.ఉమెన్ అండ్ సేఫ్టీ డీజీపీగా సౌమ్య మిశ్రా. మహిళా భద్రతే తమకు మొదటి ప్రాధాన్యం అంటోంది తెలంగాణ ప్రభుత్వం. అందుకే ఆ వింగ్‌ బాధ్యతను సౌమ్య మిశ్రాకు అప్పగించింది. బాలికలు, మహిళల భద్రతకు ఏ మాత్రం ఇబ్బంది ఉండకుండా చూడాలంటోంది. ఏసీబీ డీజీగా చారుసిన్హా. అవినీతిని కట్టడి చేసే క్రమంలో చారుసిన్హాకు ఏసీబీ డీజీగా బాధ్యతలు అప్పగించింది.

రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో ప్రణాళిలు రచిస్తున్న ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా శాంత్రి, భద్రతలను అదుపులో ఉంచాలనుకోంటిది. ట్రాఫిక్ సమస్యకు చెక్‌ పెడుతూ, అవినీతి లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చాలనుకుంటోంది. ఈ క్రమంలోనే IPSల ట్రాన్స్‌ఫర్స్ జరిగినట్టు తెలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us