Telangana Budget 2023: తెలంగాణలో ఫిబ్రవరి థర్డ్‌ టెన్షన్‌.. బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం ఉంటుందా? ఉండదా?

|

Jan 30, 2023 | 9:12 AM

బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం ఉంటుందా? ఉండదా?..-- ఫిబ్రవరి 3న బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం రెడీ. అనుమతి కోసం ఈనెల 21న గవర్నర్‌కు కేసీఆర్‌ సర్కార్‌ లేఖ. గవర్నర్‌ స్పీచ్‌ ఉందా? లేదా? చెప్పాలంటోన్న రాజ్‌భవన్‌. గతేడాది గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌కు ప్రభుత్వం ఆమోదం. అందుకే ఇప్పుడు తెలంగాణలో ఫిబ్రవరి థర్డ్‌ టెన్షన్‌.. 

Telangana Budget 2023: తెలంగాణలో ఫిబ్రవరి థర్డ్‌ టెన్షన్‌.. బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం ఉంటుందా? ఉండదా?
Governor Vs Cm Kcr
Follow us on

రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ మధ్య దూరం మరింత పెరిగిపోతోంది. అంతంతమాత్రమున్న సంబంధాలు కూడా ఇప్పుడు పూర్తిగా తెగిపోయాయ్‌. ఎవరూ పూడ్చలేనంతగా అగాధం ఏర్పడింది. పైచేయి కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తోన్న ఇరువర్గాలు ఇప్పుడు మరోసారి తమ అస్త్రాలను బయటికి తీశారు. ఫిబ్రవరి మూడున రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. మరి, ఈసారి బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం ఉంటుందా..? ఉండదా..? అనేది ఉత్కంఠ రేపుతోంది. గతేడాది గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఈసారి కూడా అలాగే చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది.

కేసీఆర్‌ సర్కార్‌కు ఊహించని షాక్‌ ఇచ్చారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌. అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వకుండా నిలిపివేశారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు అనుమతి కోసం ఈనెల 21న ప్రభుత్వం లేఖ రాస్తే.. గవర్నర్‌ స్పీచ్‌ ఉందోలేదో చెప్పాలంటూ ప్రశ్నించింది.

గవర్నర్‌పై హైకోర్టుకు వెళ్లబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేయబోతోంది. బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ అనుమతిచ్చేలా ఆదేశాలివ్వాలని కోరనున్న ప్రభుత్వం. ఇవాళ హైకోర్టులో ఏం జరగబోతోంది..? బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలని గవర్నర్‌ను హైకోర్టు ఆదేశించగలదా..? మరో నాలుగు రోజుల్లో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం