School Holidays: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులను ప్రకటించిన ప్రభుత్వం!

Telangana School Holidays: విద్యా సంవత్సరం క్యాలెండర్ ప్రకారమే షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు వెల్లడించింది. కాగా వేసవి సెలవులపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ ప్రకటన జారీ చేసింది. ఏప్రిల్ 23 లోపు పరీక్షలు పూర్తవ్వనున్న నేపథ్యంలో అదే..

School Holidays: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులను ప్రకటించిన ప్రభుత్వం!

Updated on: Apr 14, 2025 | 7:00 PM

Telangana School Holidays: ఇక తెలంగాణలో విద్యార్థులకు సమ్మర్‌ హాలిడేస్‌ రానున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విద్యార్థులకు సెలవులు రానే వస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఎండా కాలం సెలవుల్లో ఎంజాయ్‌ చేయనున్నారు విద్యార్థులు. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు 2025 వేసవి సెలవుల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది.  విద్యా సంవత్సరం ముగియడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ వేసవి సెలవుల్లో టూర్లు వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకుంటారు.

తెలంగాణ విద్యా శాఖ జారీ చేసిన విద్యా క్యాలెండర్ ప్రకారం.. తెలంగాణలోని పాఠశాలలకు వేసవి సెలవులు ఏప్రిల్ 24, 2025 నుండి ప్రారంభమవుతున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. ఇక పాఠశాలలు జూన్ 12, 2025న తిరిగి తెరుచుకుంటాయని తెలిపింది. దీని వలన పాఠశాల విద్యార్థులకు 46 రోజుల వేసవి సెలవులు లభిస్తాయి.

విద్యా సంవత్సరం క్యాలెండర్ ప్రకారమే షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు వెల్లడించింది. కాగా వేసవి సెలవులపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ ప్రకటన జారీ చేసింది. ఏప్రిల్ 23 లోపు పరీక్షలు పూర్తవ్వనున్న నేపథ్యంలో అదే రోజు పరీక్షా ఫలితాలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్ 24 నుంచే వేసవి సెలవులు ప్రకటించింది.

కళాశాల వేసవి సెలవులు:

తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) జూనియర్ కాలేజీలకు వేసవి సెలవుల షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. అధికారిక విడుదల ప్రకారం, తెలంగాణ అంతటా ఇంటర్మీడియట్ కళాశాలలు మార్చి 31 నుండి జూన్ 1, 2025 వరకు వేసవి సెలవులు కొనసాగుతాయని, జూన్‌ 2న కాలేజీని తిరిగి తెరుచుకుంటాయని తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us