27 నుంచి రైతుల ఖాతాల్లో ‘రైతు బంధు‘ సాయం: వ‌్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి

|

Dec 12, 2020 | 9:51 PM

కేంద్ర స‌ర్కార్ రైతు వ్య‌తిరేక విధానాలు అమ‌లు చేస్తోంద‌ని, అందుకే దేశ రాజ‌ధానిలో ఇంకా రైతుల ఆందోళ‌న‌లు ఆగ‌డం లేద‌ని తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి అన్నారు.

27 నుంచి రైతుల ఖాతాల్లో ‘రైతు బంధు‘ సాయం: వ‌్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి
Follow us on

కేంద్ర స‌ర్కార్ రైతు వ్య‌తిరేక విధానాలు అమ‌లు చేస్తోంద‌ని, అందుకే దేశ రాజ‌ధానిలో ఇంకా రైతుల ఆందోళ‌న‌లు ఆగ‌డం లేద‌ని తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి అన్నారు. ఇప్ప‌టికైనా రైతులకు వ్య‌తిరేకంగా ఉన్న చ‌ట్టాల‌ను కేంద్రం వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.శ‌నివారం మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని గూడురు మండ‌లం బొద్దిగొండ‌, మ‌హ‌బూబాబాద్ మండ‌లం ఏటిగ‌డ్డ తండాలోనిర్మించిన రైతు వేదిక‌ల‌ను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం, గిరిజ‌న అభివృద్ధి శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌తో క‌లిసి ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి నిరంజ‌న్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక జ‌రిగిన అభివృద్ధి 40 ఏళ్ల కింద‌టే జ‌రిగి ఉంటే గ‌ల్ఫ్ దేశాల‌తో పాటు ఇత‌ర దేశాల‌కు వ‌ల‌స వెళ్లే అవ‌స‌రం ఉండేది కాద‌ని అన్నారు.

తెలంగాణ ప‌ల్లెల్లో అప్ప‌టికీ అనేక మార్పులు వ‌చ్చాయ‌ని, స్వ‌రాష్ట్రంలో అన్ని జిల్లాల‌నూ అభివృద్ధి చేసుకుంటున్నామ‌ని అన్నారు. ఈనెల 27 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయం జ‌మ కానుంద‌ని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,300 కోట్లు రైతుల ఖాతాల్లోకి వెళ్ల‌నున్నాయ‌న్నారు. అనంత‌రం మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ మాట్లాడుతూ.. రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా క‌రోనా కాలంలో కూడా ముఖ్య‌మంత్రి కేసీఆర్ రూ.30 కోట్లు వెచ్చించి ధాన్యాన్ని కొనుగోలు చేశార‌ని గుర్తు చేశారు.