Telangana: 50 రోజుల్లో రూ. 8.72 కోట్లు ఫైన్.. ఇక అలాంటి వారిని ఉపేక్షించం అంటున్న అధికారులు

| Edited By: Balaraju Goud

Jul 17, 2024 | 2:01 PM

కేవలం 50 రోజుల వ్యవధిలో 900కి పైగా వాహనాలకు సుమారు 8 కోట్ల రూపాయల ఫైన్ రవాణా శాఖ అధికారులు విధించారు. ఫిట్‌నెస్ లేని బస్సులు, ఇతర నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. దాదాపు నెల రోజులకు పాటు ఈ స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించారు.

Telangana: 50 రోజుల్లో రూ. 8.72 కోట్లు ఫైన్.. ఇక అలాంటి వారిని ఉపేక్షించం అంటున్న అధికారులు
Rto Checkings
Follow us on

కేవలం 50 రోజుల వ్యవధిలో 900కి పైగా వాహనాలకు సుమారు 8 కోట్ల రూపాయల ఫైన్ రవాణా శాఖ అధికారులు విధించారు. ఫిట్‌నెస్ లేని బస్సులు, ఇతర నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. దాదాపు నెల రోజులకు పాటు ఈ స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించారు. అటు స్కూల్స్ కూడా జూన్, జూలైలో మొదలైన సందర్భంలో చాలావరకు ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులను సైతం అధికారులు సీజ్ చేశారు. సరైన డాక్యుమెంట్లు ఫిట్‌నెస్ లేని వాహనాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝళిపించారు.

ఇందులో భాగంగా మొత్తం 936 వాహనాలకు సంబంధించిన ఉల్లంఘనలు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వాహనాలకు అక్షరాల 8.72 కోట్ల రూపాయల ఫైన్ విధించినట్లు తెలిపారు. వీటితోపాటు కాంపౌండబుల్ రుసుము కింద మరో 9.65 లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. అధిక శాతం హైదరాబాద్‌లోనే ఎక్కువ ఉల్లంఘనలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఒక హైదరాబాద్ నుండే సుమారు కోటిన్నర ఫైన్ ల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం చేకూరింది.

హైదరాబాద్‌లో 63 వాహనాలకు జరిమానా విధించారు. మేడ్చల్ మల్కాజిగిరి ప్రాంతాల్లో మరో కోటిన్నర రూపాయల ఆదాయం ప్రభుత్వానికి చేకూరుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాల్సిందేనని అధికారుల విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి డ్రైవ్ రానున్న రోజుల్లో కొనసాగిస్తామని, ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు కచ్చితంగా పరీక్షలు చేయించుకుని సర్టిఫికెట్ ఉంటేనే రోడ్డు మీద తిప్పాలని ట్రాన్స్‌పోర్ట్ అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిలో ఎక్కువ శాతం స్కూల్ బస్సులే ఉండటం విశేషం..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..