Telangana: రేషన్‌ కార్డు ఉన్నవాళ్లకు బిగ్ అలర్ట్.. సాయంత్రంలోపు ఈ పని చేయకపోతే మీకే నష్టం..

మీరు తెలంగాణలో రేషన్ బియ్యం తీసుకునేవారికి అలర్ట్.. ప్రభుత్వం ఇచ్చిన మూడు నెలల ఉచిత కోటాను తీసుకునేందుకు శనివారమే ఆఖరు తేదీ. నేటి సాయంత్రంలోపు తీసుకోకపోతే గత నెలల స్టాక్ మళ్లీ లభించదు. అంతేకాదు.. రేషన్ కార్డు ఈ-కేవైసీ కోసం ఇకపై షాపుల దగ్గర లైన్లలో నిలబడాల్సిన పనేలేకుండా మీ ఫోన్‌లోనే చేసుకోవచ్చు..

Telangana: రేషన్‌ కార్డు ఉన్నవాళ్లకు బిగ్ అలర్ట్.. సాయంత్రంలోపు ఈ పని చేయకపోతే మీకే నష్టం..
Telangana Ration Rice Update

Updated on: Sep 05, 2026 | 9:32 AM

తెలంగాణలో మూడు నెలల ఉచిత కోటాను ఒకేసారి తీసుకునే వెసులుబాటు శనివారంతో ముగియనుంది. రానున్న ధాన్యం కొనుగోళ్ల దృష్ట్యా గిడ్డంగులు ఖాళీ చేయడం, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఆగస్టు నుండి అక్టోబర్ వరకు రావాల్సిన బియ్యాన్ని ఒకే విడతలో పంపిణీకి ఉంచింది. ఒకేసారి పెద్ద మొత్తంలో బియ్యం ఇవ్వడం వల్ల గత కొన్ని రోజులుగా కేంద్రాల వద్ద రద్దీ భారీగా పెరిగింది. దీంతో ఈ గడువును సెప్టెంబర్ 5 వరకు పెంచుతూ ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటివరకు కార్డుపై కోటా తీసుకోని కుటుంబాలు వెంటనే సమీప డీలర్ వద్దకు వెళ్లి తమ స్టాక్ తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. నేటి గడువు దాటితే గత నెలల సరుకులు మళ్లీ అందవని తేల్చిచెప్పారు. మరోవైపు డీలర్ల కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా రేషన్ కార్డు ఈ-కేవైసీ ప్రక్రియను సాంకేతికతతో మరింత సులభతరం చేశారు. ఆధార్ సెంటర్లకు వెళ్లకుండానే లబ్ధిదారులు తమ మొబైల్ ద్వారానే ముఖ గుర్తింపు పూర్తి చేసుకునే విధానాన్ని అధికారులు అందుబాటులోకి తెచ్చారు.

స్మార్ట్‌ఫోన్ ద్వారా ఈ-కేవైసీ చేసుకునే విధానం

యాప్స్ సిద్ధం చేసుకోవడం: గూగుల్ ప్లేస్టోర్ Mera eKYC, Aadhaar Face RD అనే రెండు ప్రత్యేక యాప్‌లను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి.

లాగిన్ వివరాలు: యాప్ తెరిచి రాష్ట్రాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత కార్డులోని సభ్యుల గుర్తింపు వివరాలను ఎంటర్ చేయాలి. ఫోన్‌కు వచ్చే ఆరు అంకెల ఓటీపీని నమోదు చేసి స్క్రీన్ మీద కనిపించే సెక్యూరిటీ కోడ్ సబ్మిట్ చేయాలి.

ఫేస్ గుర్తింపు: ఆ తర్వాత కెమెరా స్వయంగా ఆన్ అవుతుంది. మంచి వెలుతురు ఉన్న ప్రదేశంలో నిలబడి స్క్రీన్‌పై వచ్చే సర్కిల్‌కు సరిపోయేలా ముఖాన్ని ఉంచి, గ్రీన్ సిగ్నల్ రాగానే కనురెప్పలు కదిలిస్తే అథెంటికేషన్ పూర్తవుతుంది.

ఇలా అర్హులైన వారంతా నిర్ణీత సమయానికి ముందే తమ రేషన్ కోటాను పొందాలని పౌరసరఫరాల విభాగం సూచిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us