రెయిన్ అలర్ట్.. తెలంగాణలో రాబోయే మూడు రోజులు ఓ మోస్తరు వర్షాలు

| Edited By:

Jun 05, 2020 | 8:14 PM

గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. మొన్న పలు చోట్ల వర్షాలు పడటంతో కాస్త ఉపశమనం లభించింది.

రెయిన్ అలర్ట్.. తెలంగాణలో రాబోయే మూడు రోజులు ఓ మోస్తరు వర్షాలు
Follow us on

గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. మొన్న పలు చోట్ల వర్షాలు పడటంతో కాస్త ఉపశమనం లభించింది. తాజాగా మరో మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడితే.. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 2 రోజుల్లో అరేబియా సముద్రం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు.. ఆగ్నేయ బంగాళాఖాతంలోని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇదిలావుంటే.. హైదరాబాద్‌లో అధికారులు ముందస్తుగానే అప్రమత్తమయ్యారు. జీహెచ్‌ఎంసిలో వ‌ర్షాకాల‌ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక కింద రూ. 41.38 కోట్ల‌తో నాలాల పూడిక‌తీత ప‌నులకు రెడీ అయ్యారు. ప్లాస్టిక్, ఇత‌ర వ్య‌ర్థాలు వ‌ల‌న డ్రెయిన్లు మూసుకుపోయి వ‌ర్ష‌పునీరు రోడ్ల‌పై నిలుస్తుండటంతో.. వాటిని తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. అంతేకాదు.. వరద ముంపును నివారించుటకు ప్లాస్టిక్ వ్యర్ధాలను, చెత్తను రోడ్లపై, డ్రైనేజీలలో వేయరాదని ప్రజలకు సూచించింది.