Telangana: హైపీక్స్‌లో రాజకీయ పగ.. అసెంబ్లీ సమావేశాల వేళ హీటెక్కిన తెలంగాణ పాలిటిక్స్

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి గరిమనాభిగా నిలిచిన ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్ మళ్లీ రాజకీయ సంగ్రామానికి ప్రధాన వేదికగా మారింది. గతంలో ట్రాఫిక్ సమస్యల పేరిట కేసీఆర్ సర్కార్ దీనిని ఎత్తివేయాలని చూసినా, న్యాయస్థానం జోక్యంతో అది కొనసాగుతోంది. బాధిత ప్రజలకు, ప్రజాసంఘాలకు తక్కువ ఖర్చుతో ప్రభుత్వ దృష్టిని ఆకర్షించే వేదికగా ఉన్న ధర్నాచౌక్‌లోకి ఇప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీలే నేరుగా మోహరిస్తుండటంతో రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది.

Telangana: హైపీక్స్‌లో రాజకీయ పగ.. అసెంబ్లీ సమావేశాల వేళ హీటెక్కిన తెలంగాణ పాలిటిక్స్
Telangana Politics Heats Up

Updated on: Sep 05, 2026 | 10:27 PM

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమానికి గరిమనాభిలా పనిచేసింది ఇందిరాపార్క్‌ దగ్గరుండే ధర్నాచౌక్. తర్వాత ట్రాఫిక్ సమస్యల కారణం చూపుతూ ధర్నాచౌక్‌ను తీసెయ్యాలనుకుంది కేసీఆర్ సర్కార్. కానీ, కోర్టు అడ్డం పడ్డంతో ధర్నాచౌక్ ఉన్నచోటే ఇప్పటికీ ఉంది. దగా పడి సాయం కోసం చేతులు చాపాలన్న ప్రతీ వర్గానికీ ఇప్పటికీ ధర్నాచౌక్‌ని ఒక దగ్గరిదారిగా చెబుతారు. పైగా చీప్‌అండ్ బెస్ట్ కూడా. ఫీజు కట్టేదుండదు. పైగా పోలీసులే దగ్గరుండి సెక్యూరిటీ ఇస్తారు. వెనకొక ఫ్లెక్సీ, చేతిలో మైకుంటే చాలు. ఈజీగా ప్రభుత్వం దృష్టిలో పడొచ్చు. కానీ, నేరుగా ప్రభుత్వమే ధర్నాచౌక్‌ దగ్గరకొచ్చి మాకూ ఒక డిమాండ్ ఉంది.. అని అరిచిగీపెడితే..! ధర్నాచౌక్‌లో ఆ విచిత్రమే జరగబోతోందా? భూ భారతి’ పేరుతో అంతులేని అక్రమాలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కదం తొక్కింది కమలదండు. బీజేపీ భారీ మహాధర్నాతో దద్దరిల్లింది ధర్నాచౌక్. అయితే సెప్టెంబర్ 6.. ఆదివారం.. వేదిక మళ్లీ ధర్నాచౌకే! అపోజిషన్ లీడర్‌గా అట్టర్‌ఫ్లాపైన కేసీఆర్ రాజీనామా చేయాలంటూ కారుపార్టీపై కాలుదువ్విన కాంగ్రెస్ పార్టీ. మహాధర్నాకు పిలుపునిచ్చారు సీఎం.. దీంతో ఏర్పాట్లలో బిజీగా ఉన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు. వీళ్ల టార్గెట్ మాత్రం మాజీ సీఎం కేసీఆర్. కాంగ్రెస్, కమలం పార్టీలు డిమాండ్ల చిట్టాతో ధర్నాచౌక్‌లో మకాం పెడితే.....

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి