Hyderabad: డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసుల సర్జికల్ స్ట్రైక్.. ఇదే కంటిన్యూ అయితే….

| Edited By: Ram Naramaneni

Jul 10, 2024 | 3:10 PM

తెలంగాణ న్యాబ్.. ప్రస్తుతం పబ్స్‌పై ఫోకస్ పెట్టింది. ఏకకాలంలో పదుల సంఖ్యలో పోలీసులు.. పబ్స్‌లో ఆకస్మిక దాడులు చేస్తున్నారు. ఎవరూ తప్పించుకోకుండా.. చుట్టుపక్కల ప్రాంతాల్లో ముందుగానే సిబ్బందిని మోహరిస్తున్నారు. గతంలోలా అందర్నీ అదుపులోకి తీసుకుని.. తర్వాతి రోజు టెస్టులు చేయడం.. నోటీసులు ఇవ్వడం వంటికి కాదు.

Hyderabad: డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసుల సర్జికల్ స్ట్రైక్.. ఇదే కంటిన్యూ అయితే....
Drugs
Follow us on

డ్రగ్స్.. ఈ పేరే తెలంగాణ రాష్ట్రంలో వినిపించకుండా చేసేందుకు సర్కార్ పూర్తి యాక్షన్ ప్లాన్‌తో రంగంలోకి దిగిపోయింది. ఇందుకోసం సంబంధిత టీమ్స్‌లో స్టాఫ్‌ను పెంచింది. టీమ్స్‌కు లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొచ్చింది. డ్రగ్స్ కేసుల్లో ఎంతటివారు ఉన్నా.. ఉపేక్షించవద్దని పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు ఫుల్ పర్మిషన్ ఇచ్చింది. దీంతో యువతను మత్తు నుంచి కాపాడేందుకు… 24/7 టీమ్స్ వర్క్స్ చేస్తున్నాయి. గతంలో పెడ్లర్స్‌పై మాత్రమే కేసులు పెట్టేవారు. డ్రగ్స్ తీసుకునేవారిని బాధితులుగా పరిగణించేవారు. ఇప్పుడు కన్జుమర్స్ బెండు తీసేలా చట్టాలను తీసుకొచ్చేందుకు తెలంగాణ సర్కార్ ఫుల్ ఫోకస్‌తో ముందుకు వెళ్తుంది. మాదక ద్రవ్యాలు తెలంగాణలోకి రాకుండా చూసేందుకు.. పక్క రాష్ట్రాల సాయం కూడా కోరారు సీఎం రేవంత్ రెడ్డి.

ఇక తెలంగాణ న్యాబ్.. ప్రస్తుతం పబ్స్‌పై ఫోకస్ పెట్టింది. ఏకకాలంలో పదుల సంఖ్యలో పోలీసులు.. పబ్స్‌లో ఆకస్మిక దాడులు చేస్తున్నారు. ఎవరూ తప్పించుకోకుండా.. చుట్టుపక్కల ప్రాంతాల్లో ముందుగానే సిబ్బందిని మోహరిస్తున్నారు. గతంలోలా అందర్నీ అదుపులోకి తీసుకుని.. తర్వాతి రోజు టెస్టులు చేయడం.. నోటీసులు ఇవ్వడం వంటికి కాదు. నిమిషాల్లో అక్కడే డ్రగ్స్ పాజిటివ్ ఆర్ నెగటీవ్ అనేది తేల్చేస్తున్నారు. ఇందుకోసం అత్యాధునిక.. టెక్నాలజీ టెస్ట్ చేస్తున్నారు. యూరిన్ టెస్ట్ ద్వారా వారు ఏ రకం డ్రగ్స్ తీసుకున్నారో కూడా తేల్చేస్తున్నారు. ఇటీవల మణికొండలోని కేవ్‌ పబ్‌పై తెలంగాణ న్యాబ్‌ పోలీసులు, SOT, రాయదుర్గం పోలీసులు జాయింట్ రైడ్ చేసిన సంగతి తెలిసిందే. పబ్‌లో ఉన్న దాదాపు 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారందరికీ టెస్టులు చేయగా, 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. వారు గంజాయ్, హెరాయిన్, మెథ్, LSD ఇలా ఏ డ్రగ్స్ తీసుకున్నారో కూడా చెప్పేశారు. పట్టుబడిన వారిలో ఐటీ ఎంప్లాయిస్, బిజినెస్‌మ్యాన్‌లు, పలువురు ప్రముఖులు ఫ్యామిలీ మెంబర్స్, స్టూడెంట్స్ ఉన్నట్లు పోలీసుల ద్వారా తెలిసింది. వీరందర్ని కూడా ముందే డ్రగ్స్ తీసుకుని పార్టీకి రావాల్సిందిగా నిర్వాహకులు సూచించినట్లు పక్కా సమాచారం ఉంది. ఇలా వచ్చినవారికి ఎలక్ట్రానిక్‌ డ్యాన్స్‌ మ్యూజిక్‌ ఆఫర్ చేశారు. ఈ సౌండ్ సాధారణ వ్యక్తులు భరించలేరు.. డ్రగ్స్‌ తీసుకుంటేనే అంత భారీ శబ్ధాన్ని ఎంజాయ్ చేయగలరు. అందుకే డ్రగ్స్ తీసుకున్నోళ్లే ఈ పార్టీని ఎంజాయ్ చేస్తారని కస్టమర్లకు ఆర్గనైజర్లు చెప్పారు. అందుకే వారు డ్రగ్స్ తీసుకునే పార్టీకి వచ్చారు.

ఒక్క పబ్‌లో రైడ్ చేస్తే.. పాల్గొన్న 55 మందిలో 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ఈ లెక్కన నగరంలో ఉన్న దాదాపు 300 పబ్‌ల్లో పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. అయితే మాదక ద్రవ్యాల జోలికి వెళ్తే… పబ్ లైసెన్సులు క్యాన్సిల్ చేయడంతో పాటు కఠిన సెక్షన్లతో లోపలేస్తామని.. తెలంగాణ పోలీసులు తమ యాక్షన్స్‌తో చూపించేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో పలువురు పబ్ డీజేలు.. కూడా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. గోవాతో లింక్స్‌ ఉన్న వీరే కొందరు కస్టమర్లకు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. త్వరలో ఆ దిశలో పోలీసులు కూపీ లాగే అవకాశం ఉంది. తీగ తాగితే డొంక కదిలినట్లుగా… ఒక్కరు దొరికినా వారి నుంచి ఆ సర్కిర్‌లో డ్రగ్స్ సప్లై చేసేవారు, డ్రగ్స్ కన్జూమ్ చేసేవారి డేటాను సేకరిస్తున్నారు పోలీసులు. వారి కోడ్ లాంగ్వేజ్‌లు ట్రాక్ చేసేలా.. టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్‌ను హైర్ చేసుకున్నారు. ఇక డ్రగ్స్ గుట్టు విప్పేలా స్నిపర్ డాగ్స్‌కు కూడా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చారు. మొత్తంగా తెలంగాణ పోలీసులు డ్రగ్స్‌పై సర్జికల్ స్ట్రైక్ ప్రకటించినట్లే ఉంది. ఇదే దూకుడు కంటిన్యూ అయితే డ్రగ్ ఫ్రీ తెలంగాణ అని త్వరలో సగర్వంగా చెప్పుకోవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..