Revanth meets Konda: విశ్వేశ్వర్‌రెడ్డిని కలిసిన రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌లోకి అహ్వానం.. నిరుద్యోగ దీక్షలో పాల్గొంటా: కొండా

|

Jul 13, 2021 | 7:42 PM

పీసీసీ చీఫ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు అంటిముట్టనట్లు ఉన్న నేతలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు.

Revanth meets Konda: విశ్వేశ్వర్‌రెడ్డిని కలిసిన రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌లోకి అహ్వానం.. నిరుద్యోగ దీక్షలో పాల్గొంటా: కొండా
Revanth Reddy Meets Konda Vishweshwar Reddy
Follow us on

PCC Chief Revanth Reddy Strategy: పీసీసీ చీఫ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు అంటిముట్టనట్లు ఉన్న నేతలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. మరోవైపు రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్ కొందరిని కాంగ్రెస్ పార్టీకి దూరం చేస్తే.. మరి కొందరిని దగ్గర చేస్తోంది.. పార్టీలో ఉంటారనుకున్న వారు అనూహ్యంగా రాజీనామాలు చేస్తున్నారు. మరో పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరిగిన నేతలు ఊహించని రీతిలో పార్టీలో చేరుతున్నారు. ఆయన బాధ్యతలు తీసుకున్న రోజే సీనియర్ నేతలతో సహా కొందరు రాజీనామాలు కూడా చేసిన విషయం తెలిసిందే. ఇక నిన్న అనూహ్యం గా హుజూరాబాద్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న కౌశిక్‌రెడ్డి పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు.

ఇదిలావుంటే, . తాజాగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. విశ్వేశ్వర్ రెడ్డిని కలిసి రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌లోనే కొనసాగాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌లో తిరిగి చేరేందుకు విశేశ్వర్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణ మంచి కోసం పరితపిస్తుంటారని, ఆలయనతో రాజకీయాల కంటే.. రాష్ట్రాభివృద్ధిపైనే చర్చించామని రేవంత్‌ తెలిపారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను టీఆర్ఎస్ సర్కార్ అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌లోకి ఎప్పుడైనా రావొచ్చని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డికి పీసీసీ రావడం సంతోషంగా ఉందన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. ఆయనతో తెలంగాణ అభివృద్ధిపైనే చర్చించామని చెప్పారు. కాంగ్రెస్‌ చేపట్టే నిరుద్యోగ దీక్షలో పాల్గొంటానని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరేది త్వరలో చెబుతానని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రకటించారు.

Read Also…. Kaushik Reddy: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక రాజకీయం రోజుకో ట్విస్ట్‌.. కౌశిక్‌రెడ్డికి మణిక్యం ఠాగూర్ లీగల్ నోటీస్