తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

| Edited By: Srinu

Apr 21, 2019 | 5:12 PM

హైదరాబాద్ :తెలంగాణ పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ఎన్నికల తేదీల వివరాలను ప్రకటించారు. మొత్తం 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. తొలి విడత మే 6న, రెండో విడత మే 10న, మూడో విడత మే 14వ తేదీల్లో పోలింగ్ నిర్వహణ జరగనున్నట్లు వెల్లడించారు. మే 27న తేదీన ఓట్ల లెక్కింపును చేపట్టనున్నట్లు తెలిపారు. కాగా ఈ ఎన్నికలు […]

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
Follow us on

హైదరాబాద్ :తెలంగాణ పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ఎన్నికల తేదీల వివరాలను ప్రకటించారు. మొత్తం 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. తొలి విడత మే 6న, రెండో విడత మే 10న, మూడో విడత మే 14వ తేదీల్లో పోలింగ్ నిర్వహణ జరగనున్నట్లు వెల్లడించారు. మే 27న తేదీన ఓట్ల లెక్కింపును చేపట్టనున్నట్లు తెలిపారు. కాగా ఈ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరుగుతాయని.. జెడ్పీటీసీ అభ్యర్ధులకు రూ. 4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్ధులకు రూ.1.5 లక్షల వ్యయ పరిమితిగా నిర్ణయించినట్లు నాగిరెడ్డి తెలిపారు.