Telangana: కాంగ్రెస్‌లో తెలంగాణ ఇంటి పార్టీ విలీనం.. నేడే హస్తంతో చెరుకు సుధాకర్ షేక్‌ హ్యాండ్‌

|

Aug 05, 2022 | 7:53 AM

తెలంగాణలో అప్పుడే ఎన్నికల హీట్ కనిపిస్తుంది. ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగ్స్ చేస్తున్నారు లీడర్స్. తమ రాజకీయ భవిష్యత్ అంచనా వేసుకుని అడుగులు వేస్తున్నారు.

Telangana: కాంగ్రెస్‌లో తెలంగాణ ఇంటి పార్టీ విలీనం.. నేడే హస్తంతో చెరుకు సుధాకర్ షేక్‌ హ్యాండ్‌
Cheruku Sudhakar Reanth Red
Follow us on

తెలంగాణ పొలిటికల్ సినారియో మారింది. రోజురోజుకు ఊహించని ఇన్సిడెంట్స్ చోటుచేసుకుంటున్నాయి. ముందుస్తు మాటలు నిజమవుతాయా అన్న పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ జంపింగ్స్ కూడా ఊపందుకున్నాయి. తాజాగా ఓ పార్టీ విలీనం కూడా జరగబోతుంది. అవును తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్( Cheruku Sudhakar) కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమక్షంలో షేక్‌ హ్యాండ్‌ తీసుకోనున్నారు. అంతేకాదు తెలంగాణ ఇంటి పార్టీ(Telangana Inti Party)ని కూడా కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రజంట్ కోమటిరెడ్డి  రాజగోపాల్ వ్యవహారం కాక రేపుతుండగా.. TPCC ప్రెసిడెంట్ రేవంత్ మాత్రం తన మార్క్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు.  పార్టీ ఉపయోగపడతారనుకున్న ప్రతి లీడర్‌తో తానే స్వయంగా చర్చలు జరిపి పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు. ఇక చెరుకు సుధాకర్ రెడ్డి నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన 1961, ఆగస్టు 31న గుండ్రంపల్లిలో జన్మించారు.  MBBS చదివారు. 1997లో తెలంగాణ సాధన కోసం యాక్టివ్‌గా పని చేశారు. మలి దశ ఉద్యమంలో TRS అధ్యక్షడు కే చంద్రశేఖర్ రావు నుంచి పిలుపు అందడంతో ఆ పార్టీలో చేరారు. తెలంగాణ వచ్చిన తర్వాత.. TRS నుంచి బయటకు వచ్చి తెలంగాణ ఇంటి పార్టీ ఎస్టాబ్లిష్ చేసి ప్రజల ముందుకు వచ్చారు. అయితే గత ఏడాది జరిగిన MLC ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..