ఇంటర్ బోర్డు మరో చోద్యం.. 17 మార్కులకే పాస్

| Edited By: Ravi Kiran

Apr 24, 2019 | 7:14 PM

భద్రాద్రి కొత్తగూడెం : ఇప్పటికే తెలంగాణ ఇంటర్ బోర్డు అవకతవకలపై ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొన్న ఒక విద్యార్ధినికి మొదట “సున్నా” తరువాత 99 మార్కులు వేసిన వైనం వెలుగులోకి రాగా.. తాజాగా మరో వింత బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ విద్యార్థికి 17 మార్కులే రాగా, పాస్‌ అయినట్టు వెలుగు చూడడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెంలోని ఓ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్‌కు గణితం పేపర్ […]

ఇంటర్ బోర్డు మరో చోద్యం.. 17 మార్కులకే పాస్
Follow us on

భద్రాద్రి కొత్తగూడెం : ఇప్పటికే తెలంగాణ ఇంటర్ బోర్డు అవకతవకలపై ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొన్న ఒక విద్యార్ధినికి మొదట “సున్నా” తరువాత 99 మార్కులు వేసిన వైనం వెలుగులోకి రాగా.. తాజాగా మరో వింత బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ విద్యార్థికి 17 మార్కులే రాగా, పాస్‌ అయినట్టు వెలుగు చూడడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెంలోని ఓ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్‌కు గణితం పేపర్ (ఎ)లో 17 మార్కులు మాత్రమే వచ్చాయి. అయినా అతడు పాస్ అయినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. వాస్తవానికి గణితం పేపర్ (ఎ)లో ఉత్తీర్ణత సాధించాలంటే 27 మార్కులు రావాలి. ఈ ఘటన చూస్తే ఇంటర్ బోర్డు.. విద్యార్ధుల జీవితాలతో ఎలా చెలగాటం ఆడుతుందో అర్ధమవుతోంది.