సీఎం రేవంత్ చెప్పిన ల్యాండ్ క్రూయిజర్స్‌పై తెలంగాణ ఇంటెలిజెన్స్ ఆరా

|

Dec 28, 2023 | 9:51 PM

22 ల్యాండ్ క్రూయిజర్లు గతంలో కొని దాచారన్న సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ ఆరా తీసింది. విజయవాడలో వాటిని గుర్తించిన అధికారులు.. రెండు రోజుల్లో హైదరాబాద్‌కు తీసుకురాబోతున్నారు.

సీఎం రేవంత్ చెప్పిన ల్యాండ్ క్రూయిజర్స్‌పై తెలంగాణ ఇంటెలిజెన్స్ ఆరా
Revanth Redddy
Follow us on

బీఆర్ఎస్‌ మూడోసారి గెలిస్తే వాడుకునేందుకు కేసీఆర్ కొత్తగా 22 ల్యాండ్ క్రూయిజర్లు కొని దాచారన్న సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఒక్కో ల్యాండ్​ క్రూయిజర్‌కు 3 కోట్ల వరకు ఖర్చవుతుందని.. బుల్లెట్ ప్రూఫ్ చేయిస్తే ఇంకొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. 22 కొత్త క్రూయిజర్లు ప్రభుత్వ ఆస్తి అని, తప్పనిసరిగా వాటిని తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు.

అయితే సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పిన ల్యాండ్ క్రూయిజర్లపై తెలంగాణ ఇంటెలిజెన్స్ ఆరా తీసింది. విజయవాడలోని త్రిహయని మోటార్స్‌లో ఈ వాహనాలను గుర్తించారు. గతంలో ఇంటెలిజెన్స్, ఎస్‌ఐబీ చీఫ్ ఆదేశాల మేరకే బుల్లెట్‌ ప్రూఫింగ్‌తో పాటు ఇతర సేఫ్టీ మెజర్స్‌ కోసం ఈ వాహనాలు విజయవాడకు తరలించారని తెలిసింది.

విజయవాడలోని త్రిహయని మోటార్స్‌లో ఈ వాహనాలను గుర్తించిన అధికారులు.. రెండు రోజుల్లో హైదరాబాద్‌కు తీసుకురాబోతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…