రేవంత్ రెడ్డికి హైకోర్ట్ బిగ్ షాక్..!

| Edited By:

Mar 06, 2020 | 4:50 PM

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. గోపన్‌పల్లి భూవ్యవహారంలో రేవంత్ వేసిన పిటిషన్లపై విచారణ ముగించిన కోర్టు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం చర్యలు తీసుకోకముందే.. కోర్టులను ఎందుకు ఆశ్రయిస్తున్నారంటూ పిటిషనర్లను ప్రశ్నించింది. చట్టప్రకారం నడుచుకోవాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించింది. మరోవైపు భూవ్యవహారంలో చట్టప్రకారమే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా.. ఇప్పటికే రేవంత్ రెడ్డి భూకుంభకోణంపై RDO రిపోర్టులను తయారుచేసిన విషయం తెలిసిందే. వందల కోట్ల రూపాయల […]

రేవంత్ రెడ్డికి హైకోర్ట్ బిగ్ షాక్..!
Follow us on

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. గోపన్‌పల్లి భూవ్యవహారంలో రేవంత్ వేసిన పిటిషన్లపై విచారణ ముగించిన కోర్టు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం చర్యలు తీసుకోకముందే.. కోర్టులను ఎందుకు ఆశ్రయిస్తున్నారంటూ పిటిషనర్లను ప్రశ్నించింది. చట్టప్రకారం నడుచుకోవాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించింది. మరోవైపు భూవ్యవహారంలో చట్టప్రకారమే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కాగా.. ఇప్పటికే రేవంత్ రెడ్డి భూకుంభకోణంపై RDO రిపోర్టులను తయారుచేసిన విషయం తెలిసిందే. వందల కోట్ల రూపాయల విలువైన భూములను.. రేవంత్ బ్రదర్స్ ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ, ప్రైవేటు, చెరువు భూములను సైతం వీరు వదల్లేదని నివేదికల్లో తేల్చారు. మరోవైపు మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫామ్ హౌజ్ వద్ద అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలను ఎగరవేసి.. చిత్రీకరించారన్న ఆరోపణలతో.. రేవంత్‌తో సహా ఎనిమిది మందిపై కేసులు నమోదయ్యాయి. దీంతో గురువారం పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి..ఉప్పరపల్లి కోర్టుకు హాజరుపర్చారు. కోర్టు రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది.