TRS MLAs Poaching Case: బీజేపీ పిటిషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. ఫామ్‌హౌస్ కేసులో విచారణ నిలిపివేస్తూ ‘స్టే’..

|

Oct 29, 2022 | 3:08 PM

ఫామ్‌హౌస్ కేసులో హైకోర్టుకు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణను నిలిపివేయాలంటూ స్టే ఇచ్చింది. నవంబర్ 4వ తేదీ తరకు విచారణను నిలిపివేయాలంటూ ఆదేశించిన హైకోర్టు.. వి

TRS MLAs Poaching Case: బీజేపీ పిటిషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. ఫామ్‌హౌస్ కేసులో విచారణ నిలిపివేస్తూ ‘స్టే’..
Telangana High Court
Follow us on

ఫామ్‌హౌస్ కేసులో హైకోర్టుకు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణను నిలిపివేయాలంటూ స్టే ఇచ్చింది. నవంబర్ 4వ తేదీ తరకు విచారణను నిలిపివేయాలంటూ ఆదేశించిన హైకోర్టు.. విచారణను అదే తేదీ వరకు వాయిదా వేసింది. పోలీసులు, టీఆర్‌ఎస్‌ నేతలు పక్కా ప్లాన్‌తో ఫాంహైస్‌ ఎపిసోడ్‌ నడిపారని, పోలీసుల ఇన్వెస్టిగేషన్‌పై నమ్మకం లేదని, సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో బీజేపీ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. పై విధంగా తీర్పు వెల్లడించింది. మునుగోడు బైపోల్‌ ముగిసే వరకూ ఫాంహౌస్‌ కేసు విచారణపై స్టే విధించింది. తదుపరి విచారణ నవంబర్‌4కి వాయిదా వేసింది.

అయితే, విచారణ సందర్భంగా బీజేపీ తరఫున న్యాయవాది చాలా గట్టిగానే తమ వాదనలు వినిపించారు. ఫాంహౌస్‌లో బీజేపీకి సంబంధించిన వ్యక్తుల ప్రజెన్స్‌ లేదన్నారు. ఎలాంటి ఆధారాలనూ పక్కాగా సమర్పించలేదన్నారు. ఎవరో ముగ్గురిని తీసుకువచ్చి బీజేపీ వాళ్లంటున్నారని ఆరోపించారు. ఈ ముగ్గురు తప్ప.. ఏ రూపంలోనూ బీజేపీ ప్రమేయం ఉన్నట్లు ఎవిడెన్స్‌ లేదన్నారు. అయితే, బీజేపీ వాదనలు విన్న ధర్మాసనం.. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది. కౌంటర్ ఫైల్ చేసే వరకూ ఇన్వేస్టిగేషన్ డెఫర్ చేయాలంది ధర్మాసనం. తదుపరి విచారణను నవంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.

నిందితుల రిమాండ్‌కు గ్రీన్ సిగ్నల్..

ఇదిలాఉంటే.. ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులను రిమాండ్‌కు అప్పగించాలంటూ సైబరాబాద్ పోలీసులు వేసిన పిటిషన్‌పైనా హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. నిందితుల రిమాండ్‌కు అనుమతి ఇచ్చింది. పక్కా ప్లాన్‌తో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించినట్టు ఆధారాలున్నాయంటూ కోర్టు ముందు అడ్వకేట్ జనరల్ వినిపించిన వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. నిందితులు వెంటనే సైబరాబాద్ సీపీ ముందు హాజరవ్వాలని ఆదేశించింది. ఒకవేళ లొంగిపోకపోతే వారిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో 24 గంటల్లో హాజరుపర్చాలని.. ఆ తర్వాత రిమాండ్‌కు తరలించాలని పోలీసులను ఆదేశించింది.

బీజేపీ తరఫున లాయర్ స్పందన..

ఈ రెండు పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన వేర్వేరు తీర్పులపై బీజేపీ తరఫున న్యాయవాదులు స్పందించారు. రెండు తీర్పులు కాంట్రడిక్టరీ కాదన్నారు. రిమాండ్ చేయాలన్న ఆర్డర్‌కి, స్టే ఇచ్చిన ఆర్డర్‌కి కాంట్రడిక్షన్ లేదన్నారు న్యాయవాది రచనా రెడ్డి.

ముగ్గురినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు..

మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసు విచారణలో వేగం పెంచారు పోలీసులు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు నందకుమార్ ఇంటికి చేరుకున్నారు. నందుతో పాటు మిగతా ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులనూ సైబరాబాద్ కమిషనరేట్‌కి తరలించారు. అయితే, మీడియా కంట పడకుండా నందు ఇంటి వెనుక గేట్ నుంచి వారిని తరలించారు పోలీసులు. నిందితుల రిమాండ్‌పై హైకోర్టు ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్తామంటున్నారు సైబరాబాద్ పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..