హోటల్స్‌, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్‌కు గైడ్‌లైన్స్ రిలీజ్ చేసిన తెలంగాణ సర్కార్..

| Edited By:

Jun 07, 2020 | 10:48 PM

తెలంగాణ రాష్ట్రంలో రేపటినుంచి హోటల్స్‌, రెస్టారెంట్స్, షాపింగ్‌ మాల్స్‌ తెరుచుకోనున్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత తెరుచుకోబోతుండటంతో.. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలంగాణ ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ను రిలీజ్ చేసింది.

హోటల్స్‌, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్‌కు  గైడ్‌లైన్స్ రిలీజ్ చేసిన తెలంగాణ సర్కార్..
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో రేపటినుంచి హోటల్స్‌, రెస్టారెంట్స్, షాపింగ్‌ మాల్స్‌ తెరుచుకోనున్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత తెరుచుకోబోతుండటంతో.. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలంగాణ ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ను రిలీజ్ చేసింది. అయితే థియేటర్లు, గేమింగ్‌ పార్కులు తెరిచేందుకు మాత్రం ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు.

1. హోటల్స్‌, రెస్టారెంట్స్‌, షాపింగ్‌ మాల్స్‌లలో ఖచ్చితంగా శానిటైజర్స్ అందుబాటులో ఉండాలి
2. రెగ్యులర్‌గా శానిటైజ్ చేస్తుండాలి
3. లోనికి వచ్చే కస్టమర్ల ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు ధర్మల్ స్క్రీనింగ్‌ ఖచ్చితంగా చెక్ చేయాలి
4.ఫేస్‌ మాస్క్‌ లేకుండా లోనికి ఎవ్వర్ని కూడా అనుమతించవద్దు
5. హోటల్స్‌, రెస్టారెంట్స్‌, షాపింగ్‌ మాల్స్‌లో రూం టెంపరేచర్ 24-30 డిగ్రీల మధ్య ఉండేలా చూసుకోవాలి
6.కస్టమర్ల మధ్య సోషల్ డిస్టెన్స్ ఉండేలా చొరవ తీసుకోవాలి
7. కస్టమర్లు నిల్చునుందుకు మార్కింగ్‌ చేసి పెట్టాలి
8.కరోనా అలర్ట్స్‌కు సంబంధించిన పోస్టర్స్‌, ఆడియో,వీడియో మెటిరియల్‌ను ప్రదర్శించేలా చూడాలి
9.హోటల్స్‌, రెస్టారెంట్స్‌ ఎక్కువగా టేక్‌ అవేకి ప్రాధన్యత ఇచ్చేలా చూడాలి
10. సీటింగ్ అరేంజ్‌మెంట్‌లో సోషల్ డిస్టెన్స్ ఉండేలా చూడాలి
11.సర్వ్‌ చేసే సిబ్బంది కూడా ఖచ్చితంగా మాస్క్, గ్లౌజ్స్‌,హ్యాండ్ శానిటైజర్స్‌ను ఉపయోగించాలి