Indiramma Houses: ఆటో డ్రైవర్లకు హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్లు.. రేవంత్ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్!

ఆటో డ్రైవర్‌లకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లో ఉంటున్న ఆటో డ్రైవర్లను సొంతింటి కళను నిజం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి కోసం హైదరాబాద్‌ నగరంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రత్యేకంగా ఆటోనగర్ కాలనీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

Indiramma Houses: ఆటో డ్రైవర్లకు హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్లు.. రేవంత్ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్!
Indiramma Illu For Hyd Auto Drivers

Updated on: Nov 14, 2026 | 8:39 PM

హైదరాబాద్ నగరంలోని ఆటో డ్రైవర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి సొంత ఇంటి కలను నిజం చేస్తూ ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రత్యేకంగా ఆటోనగర్ కాలనీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు తొలి విడతలో 2 వేల మంది ఆటో డ్రైవర్ కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. నగరంలోని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం ఈ 2 వేల ఫ్లాట్లను నిర్మించనున్నారు.

బండ్లగూడ, గంధంగూడలలో ఆటోనగర్ కాలనీలను ఏర్పాటు చేయడంతో పాటు, పేట్ బషీరాబాద్, జల్ పల్లి ప్రాంతాల్లోనూ ఈ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ.220 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ గృహ నిర్మాణ పనులను తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో అత్యంత నాణ్యతతో చేపట్టనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా కేవలం అర్హులైన ఆటో డ్రైవర్లకే అత్యంత పారదర్శకంగా ఈ ఫ్లాట్లను కేటాయిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఈ పథకం ప్రత్యేకంగా ఆటోరిక్షా కార్మికుల కోసమే రూపొందించామని, ఇళ్ల కేటాయింపు, ఆర్థిక సహాయం, అర్హత ప్రమాణాలకు సంబంధించి అంశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ పథకం నిబంధనలే వర్తిస్తాయని వివరించారు. ప్రాజెక్టు అమలుకు స్థలాల లభ్యత, సాంకేతిక అంశాలు, భౌగోళిక అనుకూలతలను పరిశీలించి డీపీఆర్‌ రూపొందించడంతో పాటు ఆర్థిక ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని హౌసింగ్‌ బోర్డు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us