Swachh Bharat Awards: తెలంగాణకు అవార్డుల పంట.. స్వచ్ఛభారత్ గ్రామీణ్‌లో నెంబర్ 1 గా నిలిచిన రాష్ట్రం..

|

Oct 02, 2022 | 4:00 PM

Swachh Bharat Awards: తెలంగాణకు అవార్డుల పంట పండింది. స్వచ్ఛ భారత్ గ్రామీణ్‌లో తెలంగాణ నెంబర్ 1 గా నిలిచింది. అలాగే మరికొన్ని విభాగాల్లోనూ..

Swachh Bharat Awards: తెలంగాణకు అవార్డుల పంట.. స్వచ్ఛభారత్ గ్రామీణ్‌లో నెంబర్ 1 గా నిలిచిన రాష్ట్రం..
President Of India Draupadi
Follow us on

Swachh Bharat Awards: తెలంగాణకు అవార్డుల పంట పండింది. స్వచ్ఛ భారత్ గ్రామీణ్‌లో తెలంగాణ నెంబర్ 1 గా నిలిచింది. అలాగే మరికొన్ని విభాగాల్లోనూ తెలంగాణకు అవార్డులు వచ్చాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. మిషన్ భగీరధ పథకం క్రింద ఇంటింటికి మంచినీరు అందిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్ పురస్కారం లభించింది. గ్రామాలలో ఇంటింటికి 100 శాతం నల్లా నీరు అందిస్తున్న పెద్ద రాష్ట్రంగా దేశంలో తెలంగాణ నిలిచింది. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మిషన్ భగీరథకు జలజీవన్ పురస్కారం అందించారు. ఈ పథకం నాణ్యత, పరిమాణంలో దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందని, అన్ని గ్రామాలలో ఇంటింటికి నల్లా కనెక్షన్ల ద్వారా రోజు తాగునీరు అందిస్తున్నట్లు కేంద్ర పుభుత్వం గుర్తించి పురస్కారానికి ఎంపిక చేసింది. ఇక మొత్తంగా చూసుకుంటే అన్ని రంగాలలో కలిపి తెలంగాణకు మొత్తం 13 అవార్డులు దక్కాయి. తెలంగాణకు ఇన్ని అవార్డులు రావడంపై రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం ఈ అవార్డులు అని పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..