CM KCR Second Phase Election Campaign: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో హ్యాట్రిక్ టార్గెట్‌గా బీఆర్‌ఎస్ ప్రచారపర్వంలో దూసుకెళ్తోంది. రంగంలోకి దిగిన భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రజాశీర్వాద సభలతో జోష్‌ను పెంచుతున్నారు. ఇప్పటికే మొదటి విడత ప్రచారం కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ 9న నామినేషన్ వేయనున్నారు.
CM KCR Second Phase Election Campaign: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో హ్యాట్రిక్ టార్గెట్‌గా బీఆర్‌ఎస్ ప్రచారపర్వంలో దూసుకెళ్తోంది. రంగంలోకి దిగిన భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రజాశీర్వాద సభలతో జోష్‌ను పెంచుతున్నారు. ఇప్పటికే మొదటి విడత ప్రచారం కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ 9న నామినేషన్ వేయనున్నారు. ఆ ఆరువాత ప్రచారానికి స్పల్ప విరామం ఇస్తారు. మళ్లీ ఈనెల 13 నుంచి 28 వరకు సీఎం కేసీఆర్ మలివిడత ప్రచారం మొదలు పెట్టనున్నారు. రెండో విడత ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ 54 సభల్లో ప్రసంగించనున్నారు. 25న గ్రేటర్ మొత్తానికి కలిపి ఒకే ఒక సభ ఉండనుంది. 13 నుంచి నాన్ స్టాప్ ప్రచారంతో గులాబీ దళపతి.. దూసుకెళ్లనున్నారు.
కేసీఆర్ మలివిడత ప్రచారానికి సంబందించిన షెడ్యూల్‌ను ఒకసారి చూడండి..
13న అశ్వారావు పేట, బూర్గంపహాడ్, నర్సంపేట
14న పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం
15 న బోధన్, నిజామాబాద్ అర్బన్ , ఎల్లారెడ్డి, మెదక్