Telangana: విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు.. ఫ్రీగా భోజనం..

తెలంగాణ ప్రభుత్వం 2026-27 వార్షిక సంవత్సరానికి సంబంధించి మూడు లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్‌ను అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చింది. విద్యా రంగానికి ఏకంగా రూ. 26,674 కోట్లను కేటాయించి, భవిష్యత్తు తరాల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రతి పౌరుడికి ఆర్థిక న్యాయం అనే నినాదంతో భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో ఇంటర్ విద్యార్థుల నుంచి ఐటీఐ ట్రైనీల వరకు ఎవరికి ఎంత దక్కింది?

Telangana: విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు.. ఫ్రీగా భోజనం..
Free Mid Day Meals For Inter Students

Updated on: Mar 20, 2026 | 12:57 PM

తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో మరో కీలక అడుగు పడింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో రూ.3,24,234 కోట్ల భారీ అంచనాతో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అంబేడ్కర్‌ అడుగుజాడల్లో, సామాజిక, ఆర్థిక న్యాయమే లక్ష్యంగా ఈ బడ్జెట్‌ను రూపొందించామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ పలు విప్లవాత్మక నిర్ణయాలను ప్రకటించారు. ప్రభుత్వం ఈసారి విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రూ.26,674 కోట్లను కేటాయించింది. అంతేకాకుండా విద్యార్థుల సంక్షేమం కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

ఇప్పటివరకు పాఠశాల విద్యార్థులకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని, ఇకపై ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది పేద విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గించడానికి ఎంతగానో దోహదపడుతుందని భట్టి తెలిపారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది సరికొత్త అధ్యాయానికి నాంది అని భట్టి తెలిపారు. అంతేకాకుండా ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు నెలకు రూ.2,000 చొప్పున స్టైఫండ్ ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులను కేటాయించారు.

సామాజిక న్యాయమే మా బాట

బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అణగారిన వర్గాల ఉన్నతికి కట్టుబడి ఉందని తెలిపారు. “ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే మా అంతిమ లక్ష్యం. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగానే మా పాలన సాగుతోంది” అని ఆయన వెల్లడించారు.

Follow Us