Teachers Protest: తెలంగాణలో రోడ్డెక్కిన ఉపాధ్యాయులు.. పీఆర్‌సీ అమలు చేయాలని డిమాండ్‌

|

Feb 09, 2021 | 6:11 PM

తెలంగాణలో విద్యారంగ సమస్యల సాధనకై ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. పిఆర్సీ 45% అమలు అయే వరకు ఉద్యమం ఆగదని టీచర్స్ చెప్పారు. తమ సత్తా చూపిస్తామంటున్నారు. మేడ్చల్ జిల్లాలోని అన్ని...

Teachers Protest: తెలంగాణలో రోడ్డెక్కిన ఉపాధ్యాయులు.. పీఆర్‌సీ అమలు చేయాలని డిమాండ్‌
Follow us on

Teachers Protest: తెలంగాణలో విద్యారంగ సమస్యల సాధనకై ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. పిఆర్సీ 45% అమలు అయే వరకు ఉద్యమం ఆగదని టీచర్స్ చెప్పారు. తమ సత్తా చూపిస్తామంటున్నారు. మేడ్చల్ జిల్లాలోని అన్ని మండలాల ప్రభుత్వ ఉపాధ్యాయులు..పాదయాత్ర చేపట్టారు. కీసర చౌరస్తా నుండి పాదయాత్రగా బయల్దేరిని టీచర్లు దాదాపు 3 కిలీమీటర్లు సాగింది. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ చేరుకున్న ఉపాధ్యాయులు, కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

ప్రతి ఐదు సంవత్సరాలకు ప్రకటించాల్సిన పే రివిజన్ కమిషన్ PRC 45% ను ఆలస్యం చేయకుండా వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపిఎస్ విధానాన్ని అమలు చేయాలని, ఉపాధ్యాయులకు ప్రమోషన్‌ షెడ్యూల్‌ను ప్రకటించాలని, ఉపాధ్యాయుల బదిలీల విషయంలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పిఆర్‌టియూ అధ్యక్షులు వై.రామేశ్వర్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర చేపట్టారు. సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఎక్కడివరకైనా వెళతామన్నారు. ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని పిఆర్‌టియూటిఎస్ సభ్యులు హెచ్చరించారు.

Also Read:

ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం.. సంచలన తీర్పు వెల్లడించిన రంగారెడ్డి జిల్లా కోర్టు..

 వైఎస్ షర్మిల కొత్త పార్టీపై స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. ఎవరేమన్నారంటే..