గోడలకు పాఠాలు బోధిస్తున్న టీచర్..ఎక్కడో తెలుసా?

| Edited By:

Jul 09, 2019 | 9:44 PM

అక్కడ బడి ఉంది.. కానీ విద్యార్ధులు కనిపించరు. ఉపాధ్యాయులు మాత్రం గోడలకు మాత్రమే పాఠాలు చెప్పుకుంటున్నారు. ఈ విచిత్రమైన ఘటన ఎక్కడో జరిగింది కాదు.. రాజధాని నగరానికి కూతవేటు దూరంలోనే ఉన్న మహబూబాబాద్ జిల్లాలోనే. వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం. కొబ్లాతండాలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడ చదువుకోడానికి విద్యార్ధులు ముందుకు రావడంలేదు. హాజరుపట్టీలో తొమ్మిది మంది విద్యార్ధుల పేర్లు ఉన్నప్పటికీ స్టూడెంట్స్ మాత్రం బడికి రావడం లేదు. దీంతో చేసేదేమీ లేక అక్కడ […]

గోడలకు పాఠాలు బోధిస్తున్న టీచర్..ఎక్కడో తెలుసా?
Follow us on

అక్కడ బడి ఉంది.. కానీ విద్యార్ధులు కనిపించరు. ఉపాధ్యాయులు మాత్రం గోడలకు మాత్రమే పాఠాలు చెప్పుకుంటున్నారు. ఈ విచిత్రమైన ఘటన ఎక్కడో జరిగింది కాదు.. రాజధాని నగరానికి కూతవేటు దూరంలోనే ఉన్న మహబూబాబాద్ జిల్లాలోనే.

వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం. కొబ్లాతండాలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడ చదువుకోడానికి విద్యార్ధులు ముందుకు రావడంలేదు. హాజరుపట్టీలో తొమ్మిది మంది విద్యార్ధుల పేర్లు ఉన్నప్పటికీ స్టూడెంట్స్ మాత్రం బడికి రావడం లేదు. దీంతో చేసేదేమీ లేక అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యయుడు కిరణ్‌కుమార్  మాత్రం  బోర్డుపై పాఠాలు రాస్తూ.. గోడలకే చెప్పుకుంటూ పోతున్నారు.

ప్రభుత్వం విద్యకోసం కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నా.. క్షేత్రస్ధాయిలో మాత్రం ఇదిగో ఇలా ఉంది పరిస్థితి. అయితే తీసుకునే జీతానికి తగ్గట్టుగా పని చేయకపోతే మనసుకు మంచిగా అనిపించదని ఇక్కడ పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు టీవీ9‌తో చెప్పాడు.