MLA Etela Rajender: అసెంబ్లీ నుంచి బీజేపీ సభ్యుడు ఈటల రాజేందర్‌ సస్పెండ్‌.. ఎప్పటి వరకంటే..

|

Sep 13, 2022 | 10:31 AM

బీజేపీ సభ్యుడు ఈటల రాజేందర్‌ ఈ సెషన్‌లో కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు. స్పీకర్‌ను ఉద్దేశించి మీడియా పాయింట్‌లో ఈటల రాజేందర్‌ కొన్ని కామెంట్లు..

MLA Etela Rajender: అసెంబ్లీ నుంచి బీజేపీ సభ్యుడు ఈటల రాజేందర్‌ సస్పెండ్‌.. ఎప్పటి వరకంటే..
Etela Rajender
Follow us on

బీజేపీ సభ్యుడు ఈటల రాజేందర్‌ను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేశారు. అసెంబ్లీ నుంచి ఈటల రాజేందర్‌ ను సస్పెండ్‌ చేస్తూ.. అసెంబ్లీ వ్యవహారాల చీఫ్ ప్రశాంత్‌ రెడ్డి.. తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. దాన్ని అసెంబ్లీ కూడా ఆమోదించింది. స్పీకర్‌ను ఉద్దేశించి మీడియా పాయింట్‌లో ఈటల రాజేందర్‌ కొన్ని కామెంట్లు చేశారు. దానిపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని సభలోనే ప్రభుత్వం వైపు నుంచి సూచనలు చేశారు. అయినా ఆయన వెనక్కి తగ్గకపోవడంతో ఈ సెషన్‌ మొత్తానికి ఈటను సస్పెండ్‌ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి. దాన్ని ఆమోదించారు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి.

మార్చిలో బడ్జెట్ సెషన్‌లో ఆర్థిక మంత్రి ప్రసంగానికి అడ్డు తగిలినందుకు సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈసారి స్పీకర్‌ పోచారంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సభ నుంచి బహిష్కరించారు. ఈ సెషన్‌ మొత్తానికి సస్పెండ్‌ చేశారు. ఈటెల రాజేందర్‌ను సభ నుంచి సస్పెండ్ చేస్తూ శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి తీర్మానం పెట్టారు. దీన్ని సభ ఆమోదించింది.

ఇవాళ 3వ రోజు సభ ప్రారంభం అవుతూనే ఈటల అంశాన్ని ప్రస్తావించారు అధికారపార్టీ సభ్యులు. అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి చర్చలో పాల్గొనాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి సూచించారు. సీనియర్‌ సభ్యుడైన ఈటల.. తీరు సరిగా లేదని అన్నారు. ఐతే.. తనను సస్పెన్షన్‌ చేయాలనే నిర్ణయాన్ని ఈటల తప్పుపట్టారు. సభలో తను మాట్లాడనివ్వకుండా చేసేందుకే ఇలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వాదోపవాదాల మధ్యే సభలో తీర్మానం పెట్టడం.. సస్పెన్షన్‌ను స్పీకర్‌ ఆమోదించడం జరిగిపోయాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం