సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట.. లిక్కర్ స్కాం కేసులో బెయిల్ మంజూరు

|

Aug 27, 2024 | 1:18 PM

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. కేసుపై సుదీర్ఘంగా జరిగిన వాదనల అనంతరం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి.

సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట.. లిక్కర్ స్కాం కేసులో బెయిల్ మంజూరు
Mlc Kavitha
Follow us on

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. కేసుపై సుదీర్ఘంగా జరిగిన వాదనల అనంతరం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. కవిత ఈడీ కేసులో 5 నెలలుగా జైల్లో ఉన్నారని.. సీబీఐ కేసులో 4 నెలలుగా జైల్లో ఉన్నారని తెలిపారు. ఈ కేసులో ఎలాంటి రికవరీ లేదన్నారు. ఈ కేసులో రూ. 100 కోట్లు చేతులు మారాయన్నది కేవలం ఆరోపణలు మాత్రమే అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. PMLAలోని సెక్షన్ 45 ప్రకారం ఆమెకు బెయిల్ పొందే అర్హత ఉందని వాదించారు. కవిత మీద లేనిపోని ఆరోపణలు చేశారని.. ఈ కేసులో ఆమె ఎవరినీ బెదిరించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసులో నిందితులంతా అప్రూవర్లుగా మారిపోయారని.. ఒక్కొక్కరు ఐదు స్టేట్‌మెంట్లు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. నిందితులంతా అప్రూవర్లుగా మారి బెయిల్‌ పొందుతున్నారన్నారు. ఈడీ వాదనలపై రోహత్గీ అభ్యంతరం చెప్పారు. ఈడీ చెబుతున్న అప్రూవర్ సాక్ష్యాలను కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌లోనూ చెప్పారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కానీ కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చిందన్నారు.

కవిత కేసులో ED తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ SV రాజు వాదనలు వినిపించారు. ED నోటీస్‌ రాగానే ఫోన్లను ధ్వంసం చేసి ఫార్మాట్‌ చేశారని SV రాజు కోర్టుకు విన్నవించారు. ఫార్మాట్‌ చేసిన ఫోన్లను ఇంట్లో పనివాళ్లకు ఇచ్చారని.. ఆధారాలను కవిత తారుమారు చేశారన్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెను బెయిల్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దర్యాప్తునకు కవిత సహకరించలేదని SV రాజు వాదించారు. ఫోన్లో సమాచారం ఎక్కువైనపుడు డిలీట్‌ చేస్తాంగానీ ఫార్మాట్‌ చేయడం సహజం కాదన్నారు. కవిత ఫోన్‌లో 10 రోజుల డేటా మాత్రమే రికవర్‌ అయ్యిందన్నారు. కవిత ప్రవర్తన ఫోన్లో ఆధారాన్ని ధ్వంసం చేయడమే అన్నారు. సమాచారాన్ని ధ్వంసం చేయకపోతే కవిత.. ఇతర నిందితులతో జరిపిన సంభాషణ గురించి తెలుసుకోవచ్చని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.