కాకతీయ యూనివర్శిటీలో స్టూడెంట్స్ ఆందోళన..

| Edited By: Srinu

May 21, 2019 | 7:37 PM

వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పీహెచ్‌డీ అడ్మిషన్ ఫీజు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ స్కాలర్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్శిటీ పరిపాలన భవనం ఎదుట విద్యార్థులు ధర్నాకు దిగారు. ఆగ్రహంతో అడ్మిషన్ భవనం అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో.. అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తోన్న విద్యార్ధులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అడ్మిషన్ ఫీజులు తగ్గించే వరకు తమ పోరాటం ఆగదని […]

కాకతీయ యూనివర్శిటీలో స్టూడెంట్స్ ఆందోళన..
Follow us on

వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పీహెచ్‌డీ అడ్మిషన్ ఫీజు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ స్కాలర్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్శిటీ పరిపాలన భవనం ఎదుట విద్యార్థులు ధర్నాకు దిగారు. ఆగ్రహంతో అడ్మిషన్ భవనం అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో.. అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఆందోళన చేస్తోన్న విద్యార్ధులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అడ్మిషన్ ఫీజులు తగ్గించే వరకు తమ పోరాటం ఆగదని విద్యార్థులు హెచ్చరించారు. తమ న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.