Statue of Equality: మహావైభవంగా శ్రీరామానుజాచార్య స‌హ‌స్రాబ్ధి ఉత్సవాలు.. ఇవాళ ముచ్చింతల్‌కు వెంకయ్య, చిరంజీవి

|

Feb 12, 2022 | 10:47 AM

ముచ్చింతల్‌ శ్రీరామనగరం ఇలవైకుంఠాన్ని తలపిస్తోంది. సమతామూర్తి క్షేత్రం శ్రీమన్నారాయణ నామస్మరణతో మార్మోగిపోతోంది. వేదమంత్రాలు, అష్టోత్తర నామాలు, శ్రీలక్ష్మీనారసింహుడి స్తోత్రాలతో..శ్రీరామ నగరం పులకించి పోతోంది.

Statue of Equality: మహావైభవంగా శ్రీరామానుజాచార్య స‌హ‌స్రాబ్ధి ఉత్సవాలు.. ఇవాళ ముచ్చింతల్‌కు వెంకయ్య, చిరంజీవి
Statue Of Equality (File)
Follow us on

Sri Ramanujacharya Millennium Celebrations: ముచ్చింతల్‌(Muchintal) శ్రీరామనగరం ఇలవైకుంఠాన్ని తలపిస్తోంది. సమతామూర్తి క్షేత్రం శ్రీమన్నారాయణ నామస్మరణతో మార్మోగిపోతోంది. వేదమంత్రాలు, అష్టోత్తర నామాలు, శ్రీలక్ష్మీనారసింహుడి స్తోత్రాలతో.. శ్రీరామ నగరం పులకించి పోతోంది. యాగాలు, యజ్ఞక్రతువులు, విశేషపూజలతో ఆధ్మాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది.రామానుజాచార్యుల స‌హ‌స్రాబ్ధి ఉత్సవాలు 11రోజులుగా మహావైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామనగరం జనసంద్రంగా మారింది. ఇవాళ శనివారం జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr.NTR) కుటుంబసభ్యులు సమతామూర్తి భవ్య విగ్రహాన్ని(Statue of Equality) దర్శించుకున్నారు. యజ్ఞశాలను దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఇక సాయంత్రం 6.30గంట‌ల‌కు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముచ్చింతల్‌కు చేరుకుంటారు. అలాగే హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ప్రహ్లాద్‌ జోషి కూడా ఇవాళ శ్రీరామనగరానికి రానున్నారు. చిన్న జీయ‌ర్ స్వామితో కలిసి సమతామూర్తి భవ్య విగ్రహాన్ని ద‌ర్శించుకుంటారు. ఆ తర్వాత రామానుజాచార్యుల 3డీ మ్యాపింగ్‌ను ప్రముఖులు వీక్షిస్తారు. అలాగే స‌మ‌తా మూర్తి కేంద్రంలోని 108 దివ్య ఆలయాలను ద‌ర్శించుకుంటారు. ఇదిలావుంటే, ఇవాళ మెగాస్టార్‌ చిరంజీవి కూడా ముచ్చింతల్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. శ్రీరామనగరంలో రామానుజాచార్యుల భవ్య విగ్రహాన్ని దర్శించుకుంటారు.