Teachers Spouse Issue: బదిలీలపై వీడని లొల్లి.. తెలంగాణ ఉపాధ్యాయుల ట్రాన్స్‌ఫర్స్‌లో తేలని స్పౌజ్ ఇష్యూ..

|

May 29, 2022 | 1:17 PM

Teachers Spouse Issue: 13 జిల్లాల్లో ఆప్షన్ కింద ట్రాన్స్‌ఫర్లో మార్పు కోరుకున్న వారి రిక్వెస్ట్ పై ప్రభుత్వం స్పందికచపోవడంతో.. భార్యభర్తలను వేరు చేయొద్దంటూ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓకే జిల్లాలో..

Teachers Spouse Issue: బదిలీలపై వీడని లొల్లి.. తెలంగాణ ఉపాధ్యాయుల ట్రాన్స్‌ఫర్స్‌లో తేలని స్పౌజ్ ఇష్యూ..
Teachers Spouse Issue
Follow us on

తెలంగాణ ఉపాధ్యాయుల(Teachers Transfers ) బదీలల్లో స్పౌజ్ ఇష్యూ ఇంకా కొలిక్కిరాలేదు. 13 జిల్లాల్లో ఆప్షన్ కింద ట్రాన్స్‌ఫర్లో మార్పు కోరుకున్న వారి రిక్వెస్ట్ పై ప్రభుత్వం స్పందికచపోవడంతో.. భార్యభర్తలను వేరు చేయొద్దంటూ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓకే జిల్లాలో భార్యభర్తలు ఉండేలా చూస్తామన్న ప్రభుత్వం.. తమను మాత్రం 150 నుంచి 200 కిలోమీటర్లు భర్తలకు దూరంగా ట్రాన్స్ఫర్ చేయడంపై కన్నీరు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 317 జీవో కింద బదీలులు చేసిన తర్వాత అభ్యంతరాలను స్వీకరించి స్పౌజ్ ఆఫ్షన్ కింద అప్లే చేసుకునే అవకాశం ఇచ్చింది. అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అప్లికేషన్లు రావడంతో ..19 జిల్లాల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరో 13 జిల్లాల స్పౌజ్ ఆప్షన్ అప్లికేషన్లను హోల్డ్ లో పెట్టింది. ఇప్పుడు ఇదే దాదాపు 1500 మంది మహిళా టీచర్ల ఆవేదనకు కారణం అయింది.

విద్యాశాఖలో అంతర్‌ జిల్లా టీచర్ల బదిలీలు చేపట్టడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. ఈ విషయంపై రాష్ట్రంలోని పలు ఉపాధ్యాయ సంఘాలు ఉన్నతాధికారులపై ఫైర్‌ అవుతున్నాయి. 317 జీవో, అప్పీళ్లు, మ్యూచువల్‌ బదిలీలు, స్పౌజ్‌ బదిలీలు పరిష్కారానికి నోచుకోక ముందే మెడికల్‌ గ్రౌండ్స్‌ లాంటి ఏవో కొన్ని కారణాలు చూపి అంతర్‌ జిల్లాల బదిలీలు చేపట్టడం సమంజం కాదంటున్నారు. భార్యాభర్తల బదిలీలు, పరస్పర బదిలీలకు సంబంధించిన సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారని విద్యాశాఖను ఉపాధ్యాయ సంఘాల నేతలు నిలదీస్తున్నారు.