Telangana: ఈ చెట్టును కాపాడేందుకు 2 కోట్ల నిధులు.. దీని స్పెషాలిటీ ఏంటంటే…?

|

Sep 15, 2022 | 12:56 PM

చారిత్రాత్మక పిల్లలమర్రి సంరక్షణకు తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి శ్రీనివాస్‌గౌడ్ కృషి చేస్తుండటం ఎంతో గొప్ప విషయమని రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రశంసలు కురిపించారు.

Telangana: ఈ చెట్టును కాపాడేందుకు 2 కోట్ల నిధులు.. దీని స్పెషాలిటీ ఏంటంటే...?
Pillalamarri Big Banyan Tree
Follow us on

Mahabubnagar: ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్(MP Joginapally Santhosh Kumar).. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో పర్యావరణ హితానికి తపిస్తున్న విషయం తెలిసిందే. ఎంతోమంది సెలబ్రిటీలతో మొక్కలు నాటిస్తూ.. ఆ దిశగా ప్రజలను కూడా ప్రొత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. మనిషి మంచిగా బతకాలంటే అందుకు.. పర్యావరణం, పచ్చదనం ఎంతో అవసరమని ఆయన నిత్యం చెబుతూ ఉంటారు. కాగా ఆసియాలోనే రెండో అతిపెద్ద పిల్లల మర్రిచెట్టును ఆయన సందర్శించారు. మహబూబ్‌నగర్‌లో పర్యాటకులను ఆకర్షిస్తున్న 800 ఏళ్ల వయసున్న ఆ వృక్షాన్ని చూసి.. ఆయన తన్మయత్వానికి లోనయ్యారు. ఈ భారీ పురాతన వృక్ష సంరక్షణ కోసం.. తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.2 కోట్లు విడుదల చేస్తున్నట్లు సంతోష్ తెలిపారు. ఇంతటి చారిత్రక  నేపథ్యం ఉన్న చెట్లను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పిల్లలమర్రిని సంరక్షిస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను(Tourism Minister Srinivas Goud), జిల్లా యంత్రాంగాన్ని ఎంపీ అభినందించారు. కాగా గతంలో ఎండిపోయే దశకు వచ్చిన ఈ భారీ చెట్టును సంరక్షించేందుకు.. సెలైన్ డ్రిప్ ట్రీట్ మెంట్ అందించారు. అలా ప్రతి వేరును ఎండిపోకుండా, పాడవ్వకుండా జాగ్రత్తగా చూసుకుని.. దానికి తిరిగి ఊపిరి పోశారు. ఈ మహా వృక్షం వద్ద మంత్రితో ఫోటోలు దిగిన సంతోష్.. వాటిని తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..