రేవంత్ రెడ్డి కేసుల చిట్టా ఇదే.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా..63 కేసులు..

| Edited By:

Mar 13, 2020 | 5:45 PM

తవ్విన కొద్ది ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కేసుల చిట్టా.. ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు.. మొత్తం 63 కేసులు ఉన్నాయి రేవంత్‌పై. రేవంత్ నోటి దురుసే కాకుండా.. ఆయన చేసిన అక్రమాలతోనే ఆయనపై ఇన్ని కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. రెచ్చగొట్టే కేసులతో పాటు.. భూకబ్జాలు, ఫోర్జరీ కేసులు, చీటింగ్ కేసులతో మొత్తం 63 కేసులు ఉన్నాయి. ఎక్కడైనా ఖాళీ స్థలం కనిపిస్తే చాటు.. అక్కడ రేవంత్ పాగా వేయడం ఖాయం. సదరు […]

రేవంత్ రెడ్డి కేసుల చిట్టా ఇదే.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా..63 కేసులు..
Follow us on

తవ్విన కొద్ది ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కేసుల చిట్టా.. ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు.. మొత్తం 63 కేసులు ఉన్నాయి రేవంత్‌పై. రేవంత్ నోటి దురుసే కాకుండా.. ఆయన చేసిన అక్రమాలతోనే ఆయనపై ఇన్ని కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. రెచ్చగొట్టే కేసులతో పాటు.. భూకబ్జాలు, ఫోర్జరీ కేసులు, చీటింగ్ కేసులతో మొత్తం 63 కేసులు ఉన్నాయి.

ఎక్కడైనా ఖాళీ స్థలం కనిపిస్తే చాటు.. అక్కడ రేవంత్ పాగా వేయడం ఖాయం. సదరు స్థల యజమానుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ భూములను తన పేరు మీదకు బదలాయించుకుంటుంటాడు. అలా చేస్తున్న సమయంలో ఎవరు అడ్డువచ్చిన బెదిరింపులకు పాల్పడతుంటారట. ఆయన కబ్జా చేసిన భూముల్లో దళితుల భూములు కూడా ఉన్నాయి. ఎవరైనా ఇదేంటని ప్రశ్నిస్తే.. వారిని మాటలతోనే భయబ్రాంతులకు గురిచేస్తుంటారు.. ఇలా ఆయన నోటి దురుసుతో ఇప్పటికి నమోదైన కేసులు చూస్తే షాక్ తినాల్సిందే. ఆయనపై ఉన్న మొత్తం 63 కేసుల్లో.. జనాలను రెచ్చగొడుతూ.. నోటి దురుసుతొనే 32 కేసులు ఉన్నాయి.
ఇక ఫోర్జరీ కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, భూకబ్జాలు, ఆదేశాల ఉల్లంఘన కింద రేవంత్‌రెడ్డిపై 30కిపైగానే కేసులు నమోదయ్యాయి. ఇక పోలీస్ స్టేషన్‌లవారీగా చూస్తే కొడంగల్‌లో తొమ్మది కేసులు, సైఫాబాద్‌లో 10, గచ్చిబౌలిలో నాలుగు వీటిలో ఒక అట్రాసిటీ కేసు కూడా ఉంది. ఇక మద్దూరులో మూడు, జూబ్లీహిల్స్‌లో మూడు, బంజారాహిల్స్‌లో మూడు, ఆబిడ్స్‌లో మూడు, సుల్తాన్‌బజార్‌లో మూడు, ఉస్మానియా యూనివర్సిటీ స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ.. ప్రజల్ని రెచ్చగొట్టే కేసులు.. ల్యాండ్ కబ్జాలు, ఫోర్జరీ కేసులే. ఇదంతా ఇలా ఉంటే.. జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీ కేసు ఒకటి ఉండనే ఉంది. ఇక దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు కూడా ఉండనే ఉంది. ఆ కేసులో డబ్బులు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఇది కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి సంబంధించిన 63 కేసుల చిట్టా.