119 ఏళ్ల నాటి రికార్డ్ రిపీట్..!

| Edited By:

Sep 18, 2019 | 9:32 AM

హైదరాబాద్‌లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి కురిసిన వర్షంతో పలు రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి అర్థరాత్రి వరకూ ఏకధాటిగా వర్షం కురవడంతో.. విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రహదారులకు రాకపోకలు నలిచిపోయాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో.. పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి […]

119 ఏళ్ల నాటి రికార్డ్ రిపీట్..!
Follow us on

హైదరాబాద్‌లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి కురిసిన వర్షంతో పలు రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి అర్థరాత్రి వరకూ ఏకధాటిగా వర్షం కురవడంతో.. విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రహదారులకు రాకపోకలు నలిచిపోయాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో.. పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం కురిసింది.

ముఖ్యంగా నల్గొండ జిల్లాల్లో ఎడతెరుపులేని వానతో జనజీవనం స్తంభించింది. 6 గంటల్లో 200.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసి సరికొత్త రికార్డు నమోదైంది. గత 119 ఏళ్లలో వాతావరణ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో.. ఈ స్థాయి వర్షం పడటం మొదటిసారి. మంగళవారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకూ.. కొన్ని ప్రాంతాల్లో వర్షం జోరుగా పడింది. రోడ్లు.. చెరువులను తలపించాయి. వచ్చే రెండు, మూడు రోజుల్లో కూడా.. భారీగా వర్షాలు పడతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.