Khammam: స్టార్ట్ చేయగానే పల్సర్ బైక్‌లో మంటలు.. కళ్లముందే కాలి బూడిదైన వైనం

|

Apr 28, 2022 | 5:51 PM

ఇటీవల పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్‌ బైక్‌‌లు తగలబడుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, కార్ల వంటి వాహనాల్లో కూడా ఇటీవల మంటలు చెలరేగాయి. తాజాగా ఖమ్మంలో అలాంటి ఇన్సిడెంటే చోటు చేసుకుంది.

Khammam: స్టార్ట్ చేయగానే పల్సర్ బైక్‌లో మంటలు.. కళ్లముందే కాలి బూడిదైన వైనం
Bike Catches Fire
Follow us on

Viral video: సమ్మర్ ఎఫెక్ట్ మామలుగా లేదు. భానుడు నిమ్ములు చిమ్ముతున్నాడు. ఎండల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్‌ బైక్‌‌లు తగలబడుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, కార్ల వంటి వాహనాల్లో కూడా ఇటీవల మంటలు చెలరేగాయి. ఎండవేడిమి, షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా తరచూ ఇలాంటి ప్రమాదాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఖమ్మం నగరంలో పల్సర్‌ బైక్‌లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే వాహనం తగలబడిపోయింది. తేజ అనే వ్యక్తికి చెందిన పల్సర్‌ 150 బైక్‌ స్టార్ట్‌ చేయగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దాంతో అతడు భయపడి దూరంగా పరిగెత్తాడు. వెంటనే మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. కళ్లముందే బైక్‌ తగలబడిపోయింది. భయంతో పరుగులు తీసిన తేజ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాడు. బైక్ కాలిపోతున్న వీడియోను స్థానికులు వీడియో తీశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజంట్ మండుతున్న ఎండల నేపథ్యంలో బైక్స్ బయట ఎండలో పార్క్ చేయకండి.. ప్రమాదాలను కొని తెచ్చుకోకండి.

Also Read: Telangana Weather Report: మండే ఎండల్లో కూల్ న్యూస్.. రాష్ట్రంలో మూడ్రోజులపాటు వర్షాలు