నీళ్ల ఆదా కోసం బాలికల జుట్టు కత్తిరించిన ప్రిన్సిపాల్..!

| Edited By:

Aug 13, 2019 | 12:58 PM

నీళ్లు.. ఆదా కోసం బాలికల బట్టు కత్తిరించారు ఓ ప్రిన్సిపాల్. ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలోని గిరిజన మినీ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. సాధారణంగా అమ్మాయిల తలస్నానంకు ఎక్కువ నీరు అవసరమవుతుండటంతో ఈ ప్రిన్సిపాల్ ఇలా.. అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. హాస్టల్‌లో నీటి కొరత తీవ్రంగా ఉండటంతోనే ఇలా చేయాల్సి వచ్చిందని ప్రిన్సిపాల్ చెబుతున్నారు. తాజాగా.. మెదక్ జిల్లాలో నీటి సమస్య తలెత్తింది. కాగా.. ఈ స్థానిక గిరిజన మినీ గురుకుల పాఠశాల ఒకటవ తరగతి […]

నీళ్ల ఆదా కోసం బాలికల జుట్టు కత్తిరించిన ప్రిన్సిపాల్..!
Follow us on

నీళ్లు.. ఆదా కోసం బాలికల బట్టు కత్తిరించారు ఓ ప్రిన్సిపాల్. ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలోని గిరిజన మినీ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. సాధారణంగా అమ్మాయిల తలస్నానంకు ఎక్కువ నీరు అవసరమవుతుండటంతో ఈ ప్రిన్సిపాల్ ఇలా.. అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. హాస్టల్‌లో నీటి కొరత తీవ్రంగా ఉండటంతోనే ఇలా చేయాల్సి వచ్చిందని ప్రిన్సిపాల్ చెబుతున్నారు. తాజాగా.. మెదక్ జిల్లాలో నీటి సమస్య తలెత్తింది.

కాగా.. ఈ స్థానిక గిరిజన మినీ గురుకుల పాఠశాల ఒకటవ తరగతి నుంచి ఆరు తరగతులు ఉన్నాయి. ఇందులో 180 మంది విద్యార్థినులు చదువుతున్నారు. హాస్టల్‌ల్లో కూడా నీటి సమస్య తలెత్తడంతో.. ప్రిన్సిపాల్ అరుణ ఇలా వినూత్నంగా చేశారు. బాలికలందరికీ బాయ్ కట్ చేయించారు. బక్రీద్ సందర్భంగా.. సోమవారం స్కూల్‌కి సెలవు కావడంతో.. తల్లిదండ్రులు పిల్లల్ని చూడటానికి హాస్టల్‌కి వచ్చారు. దీంతో.. ఒక్కసారిగా పిల్లల్ని చూసిన వారు షాక్.. అయ్యారు. అసలు ఏమాత్రం మాకు సమాచారం ఇవ్వకుండా.. ఇలాంటి పని చేయడమేంటని.. తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ అరుణని నిలదీశారు.