JEE లో మంచి ర్యాంక్.. NIT లో సీట్.. ఇంజనీరింగ్ ఆపేసి ఏం చేస్తున్నాడో తెలుసా..?

హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ విక్రియదారులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. నిత్యం పబ్బులకు వెళ్లి డ్రగ్స్ సేవించే వారితో పాటుగా అమ్మే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల కాలంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని పబ్‌లపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు పోలీసులు.

JEE లో మంచి ర్యాంక్.. NIT లో సీట్.. ఇంజనీరింగ్ ఆపేసి ఏం చేస్తున్నాడో తెలుసా..?
Ganja Gang Arrest
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jun 30, 2024 | 11:29 AM

హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ విక్రియదారులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. నిత్యం పబ్బులకు వెళ్లి డ్రగ్స్ సేవించే వారితో పాటుగా అమ్మే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల కాలంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని పబ్‌లపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు పోలీసులు. ఈ దాడుల్లో డ్రగ్స్ సేవిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే డ్రగ్స్ విక్రయిస్తున్న వారిని విచారించిన పోలీసులకు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇంజనీరింగ్ చదువుకున్న ఓ యువకుడు డ్రగ్స్‌కు బానిసగా మారి, డబ్బులు సరిపోక విక్రేతగా మారాడు. ఈ క్రమలోనే డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులకు చిక్కాడు. మాదాపూర్ పోలీసులు, తెలంగాణ నార్కోటిక్ సిబ్బంది సముక్తంగా నిర్వహించిన దాడుల్లో అతడితోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. బోయినపల్లికి చెందిన కురంథోత్ రాథోడ్ నాయక్ అలియాస్ నవీన్ రాథోడ్ బెంగళూరులో ఉంటాడు. చదువుల్లో చురుకైన అతను జేఈఈలో మంచి ర్యాంకును సాధించి, 2017లో తమిళనాడు తిరుచురాపల్లిలోని ఎన్ఐటీలో సీటు సాధించాడు. అక్కడే గంజాయికి అలవాటు పడి బానిస అయ్యాడు. విషయం తెలిసిన తల్లి, అతనితోపాటు ఉంటూ కుమారుడి అలవాటును మార్పించేందుకు ప్రయత్నాలు చేసింది. అయినా ఫలితం లేదు.

బీటెక్ మూడో సంవత్సరంలోనే చదువు మానేసి బెంగళూరుకి వెళ్ళాడు నవీన్. ఓ ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఆఫీసర్‌గా చేరాడు. ఉద్యోగరీత్యా వివిధ రాష్ట్రాలకు వెళ్లే క్రమంలో గంజాయి మాదకద్రవ్యాల విక్రతలతో పరిచయాలు పెరిగాయి. దీంతో వారి నుంచి కొని, అమ్మడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే 2022లో పోలీసులకు చిక్కగా జైలు శిక్ష పడింది. ఆందోళన చెందిన తల్లితండ్రులు అనారోగ్యానికి గురయ్యారు. తల్లి రెండేళ్ల నుంచి మంచానికే పరిమితమైంది.

ఇదిలావుంటే, తాజాగా మాదాపూర్‌లో ఉంటున్న నవీన్‌కు దూద్‌బౌలి ప్రాంతానికి చెందిన మోతీకార్ సచ్చిదానంద అలియాస్ సచిన్, ప్రణీత్ రెడ్డి, రాహుల్ రాజ్‌తో పరిచయం ఏర్పడింది. ముగ్గురితో కలిసి నవీన్ గంజాయి విక్రయాలు చేపట్టాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు టీజీ న్యాబ్ పోలీసులు దాడి చేశారు. వారి వద్ద నుంచి 1.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అవును నయన్ తో గొడవలు నిజమే.. నిజం చెప్పిన త్రిష.
అవును నయన్ తో గొడవలు నిజమే.. నిజం చెప్పిన త్రిష.
ప్రతి వ్యాధికి మందులా దానిమ్మ..! అద్భుతమైన ఔషధ గుణాలు తెలిస్తే..
ప్రతి వ్యాధికి మందులా దానిమ్మ..! అద్భుతమైన ఔషధ గుణాలు తెలిస్తే..
చాణుక్యుడు చెప్పిన ఈ 10 విషయాలతో .. ష్టాన్ని ఈజీగా ఎదుర్కోవచ్చు..
చాణుక్యుడు చెప్పిన ఈ 10 విషయాలతో .. ష్టాన్ని ఈజీగా ఎదుర్కోవచ్చు..
ట్రోఫీలు అందించిన మూడు క్యాచ్‌లు గుర్తున్నారా?
ట్రోఫీలు అందించిన మూడు క్యాచ్‌లు గుర్తున్నారా?
రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా 5 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే.
రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా 5 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే.
తెలంగాణలో ఆ జిల్లా పేరు మార్పు.. మంత్రి చోరవతో కలెక్టర్ ఆదేశాలు..
తెలంగాణలో ఆ జిల్లా పేరు మార్పు.. మంత్రి చోరవతో కలెక్టర్ ఆదేశాలు..
అప్పుడే OTTలోకి వస్తున్న 100 కోట్లసూపర్ హిట్ మూవీ..
అప్పుడే OTTలోకి వస్తున్న 100 కోట్లసూపర్ హిట్ మూవీ..
ఇదేం వింత కోరిక తల్లి.! భర్త ముందే ప్రియుడితో అలా.. ఫ్యూజులు ఔట్
ఇదేం వింత కోరిక తల్లి.! భర్త ముందే ప్రియుడితో అలా.. ఫ్యూజులు ఔట్
17 ఏళ్ల బ్యాడ్మింటన్ ప్లేయర్‌.. గ్రౌండ్‌లోనే కుప్పకూలి మృతి
17 ఏళ్ల బ్యాడ్మింటన్ ప్లేయర్‌.. గ్రౌండ్‌లోనే కుప్పకూలి మృతి
జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు సిద్ధమైన భారత్.. పూర్తి షెడ్యూల్ ఇదే
జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు సిద్ధమైన భారత్.. పూర్తి షెడ్యూల్ ఇదే