Passport based ‘Dharani’ : పాస్‌పోర్టు ఆధారంగా ‘ధరణి’ పాస్‌బుక్‌.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

|

Jan 22, 2021 | 6:57 AM

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాస్‌పోర్టు ఆధారంగా ఎన్నారైలు పాసుబుక్కులను పొందే ఆప్షన్‌ను ధరణి పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకువస్తూ  నిర్ణయించింది. ఈ సేవలు...

Passport based Dharani : పాస్‌పోర్టు ఆధారంగా ‘ధరణి’ పాస్‌బుక్‌.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
Follow us on

Passport based ‘Dharani’ : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాస్‌పోర్టు ఆధారంగా ఎన్నారైలు పాసుబుక్కులను పొందే ఆప్షన్‌ను ధరణి పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకువస్తూ  నిర్ణయించింది. ఈ సేవలు శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. 2017లో భూ రికార్డుల నవీకరణ జరిగినప్పుడు ఆధార్‌ లేదనే కారణంతో ప్రవాస భారతీయులకు పాస్‌ బుక్కును ప్రభుత్వం నిరాకరించిన విషయం తెలిసిందే.

ఇటీవలే పాస్‌ పోర్టు ఆధారంగా పాస్‌బుక్కులు జారీ చేయాలని సీఎం కేసీఆర్‌ కలెక్టర్లను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్‌లో పాస్‌పోర్టు ఆధారంగా పాస్‌బుక్కులకోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి, పాస్‌బుక్కుల జారీకి ఆమోదం తెలుపుతారు.