కన్న కొడుకు కోరిక తీర్చిన తల్లిదండ్రులు.. 24 గంటలు గడవకముందే తీరని విషాదం!

ఎంతోకాలంగా కుడుకు అడిగిన కోర్కెను తల్లీదండ్రులు తీర్చేశారు. కొడుకు ముచ్చటపడి అడిగిన బైక్‌ను తల్లిదండ్రులు కొనిచ్చారు. కొత్త వాహనంపై కొడుకు సంతోషంగా తిరుగుతుంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. బైక్‌ కొనిచ్చిన 24 గంటలు గడవకముందే అదే వాహనం ప్రమాదానికి కారణమైంది. ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన ఆ తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చింది.

కన్న కొడుకు కోరిక తీర్చిన తల్లిదండ్రులు.. 24 గంటలు గడవకముందే తీరని విషాదం!
Tragic Accident

Updated on: Nov 07, 2026 | 6:41 PM

హైదరాబాద్‌: ఎంతోకాలంగా కుడుకు అడిగిన కోర్కెను తల్లీదండ్రులు తీర్చేశారు. కొడుకు ముచ్చటపడి అడిగిన బైక్‌ను తల్లిదండ్రులు కొనిచ్చారు. కొత్త వాహనంపై కొడుకు సంతోషంగా తిరుగుతుంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. బైక్‌ కొనిచ్చిన 24 గంటలు గడవకముందే అదే వాహనం ప్రమాదానికి కారణమైంది. ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన ఆ తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్‌ నగరంలోని రాజేంద్రనగర్‌లో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్‌గూడకు చెందిన రాజు, కుమారి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజు కూలి పనులు చేస్తుండగా, కుమారి ఇళ్లల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తమకు ఉన్నంతలో పిల్లలకు మంచి చదువు చెప్పించాలని ఆ దంపతులు కష్టపడుతున్నారు. వారి కుమారుడు అయ్యప్ప అలియాస్‌ ఆకాష్‌ (18) ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కొంతకాలంగా తనకు బైక్ కొనివ్వాలని తల్లిదండ్రులను అడుగుతున్నాడు. వయసు చిన్నది కావడంతో వారు మొదట్లో అతడిని సముదాయించారు. అయితే, ఆకాష్‌ పట్టుబట్టడంతో చివరకు గురువారం (నవంబర్ 05 ) రూ.1.50 లక్షలు వెచ్చించి కొత్త బైక్‌ కొనిచ్చారు.

కొత్త బైక్‌ రావడంతో ఆకాష్‌ ఎంతో సంతోషించాడు. అదే రోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో తన స్నేహితుడు రామ్‌చరణ్‌ను వాహనంపై ఎక్కించుకుని బయలుదేరాడు. రాజేంద్రనగర్‌ చౌరస్తా వద్దకు చేరుకోగానే బైక్‌ అదుపుతప్పి డివైడర్‌పై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆకాష్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అతడితోపాటు ప్రయాణిస్తున్న రామ్‌చరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన రామ్‌చరణ్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రాజ్‌కుమార్‌ తెలిపారు. బైక్‌ కొనిచ్చిన రోజే కుమారుడు మృత్యువాత పడటంతో రాజు, కుమారి దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎంతో కష్టపడి పెంచిన కొడుకు కొత్త బైక్‌పై తిరిగి వస్తాడని ఎదురుచూసిన ఆ తల్లిదండ్రులకు, అతడి మరణవార్త గుండెలవిసేలా చేసింది.

కొత్త వాహనం నడిపేటప్పుడు స్పీడ్ కంట్రోల్, హెల్మెట్‌ ధరించడం, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం అత్యంత ముఖ్యం. చిన్న నిర్లక్ష్యం కూడా కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చే ప్రమాదం ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us