Hyderabad: ఈ ప్రాంతాల్లో మెట్రో రైలు నిర్మాణం.. రెండోదశ పనులను పరిశీలించిన అధికారులు..

|

Jul 11, 2024 | 6:24 AM

మెట్రో రైల్ రెండో దశలో చేపట్టనున్న పనులపై ఎండి ఎన్వీఎస్ రెడ్డి తనిఖీ చేశారు. జాతీయ రహదారులపై రెండో దశ మెట్రో మార్గాలను పరిశీలించారు. మియాపూర్- పటాన్‎చెరువు -ఎల్బీనగర్ -హయత్ నగర్ కారిడార్లలో నేషనల్ హైవే అధికారులతో పాటూ మెట్రో ఇంజనీరింగ్ అధికారులు కలిసి పరిశీలించారు. హైదరాబాద్ మహానగరానికి తలమానికంగా నిలిచిన మెట్రోపనులు విస్తరణ చేపట్టింది కాంగ్రెస్ సర్కార్. అందులో భాగంగా రెండవ విడత పనులను పరిశీలిస్తున్నారు.

Hyderabad: ఈ ప్రాంతాల్లో మెట్రో రైలు నిర్మాణం.. రెండోదశ పనులను పరిశీలించిన అధికారులు..
Hyderabad Metro
Follow us on

మెట్రో రైల్ రెండో దశలో చేపట్టనున్న పనులపై ఎండి ఎన్వీఎస్ రెడ్డి తనిఖీ చేశారు. జాతీయ రహదారులపై రెండో దశ మెట్రో మార్గాలను పరిశీలించారు. మియాపూర్- పటాన్‎చెరువు -ఎల్బీనగర్ -హయత్ నగర్ కారిడార్లలో నేషనల్ హైవే అధికారులతో పాటూ మెట్రో ఇంజనీరింగ్ అధికారులు కలిసి పరిశీలించారు. హైదరాబాద్ మహానగరానికి తలమానికంగా నిలిచిన మెట్రోపనులు విస్తరణ చేపట్టింది కాంగ్రెస్ సర్కార్. అందులో భాగంగా రెండవ విడత పనులను పరిశీలిస్తున్నారు. గతంలో ఉన్న రూట్ మ్యాప్ లలో మార్పులు చేసి సరికొత్తగా రూపొందించారు. వాటికి అనుగుణంగా పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు అధికారులు. అందులో భాగంగానే జూలై 10 బుధవారం మెట్రో అధికారులతో పాటూ నేషనల్ హైవే అధికారులు ప్రకాశ్ నగర్ లోని మెట్రో రైల్ లిమిటెడ్ భవన్ లో సమావేశమయ్యారు. రెండోదశ పనులను తనిఖీ చేపట్టారు.

మైలార్ధేవ్‎పల్లి – ఆరంగర్ – న్యూ హైకోర్టు మార్గంలోని జాతీయ రహదారి వెంబడి మెట్రో రైలు నిర్మాణం సాధ్యసాధ్యాలతో పాటూ ఇతర పరిస్థితులను పరిశీలించారు.ఈ మార్గంలో ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్లతో పాటు భవిష్యత్తులో కొత్త ఫ్లై ఓవర్ల నిర్మాణం ప్రణాళికలు ఉన్నందున అందుకు తగ్గట్లుగా మెట్రో అలైన్మెంట్ రూపకల్పనపై ఫోకస్ పెట్టారు అధికారులు. ఎల్బీనగర్ – హయత్ నగర్ మార్గంలో ఏడు కిలోమీటర్ల మేర నేషనల్ హైవే‎పై మెట్రో నిర్మాణం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకూ అందుబాటులో ఉండగా.. ఎల్బీనగర్ జంక్షన్ నుండి చింతలకుంట వరకు సెంటర్ మీడియన్‎లలో మెట్రో పిల్లర్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. అక్కడి నుండి మిగిలిన ప్రాంతమంతా రోడ్డుకు ఎడమ వైపు ఉన్న సర్వీస్ రోడ్లో అలైన్మెంట్ రూపొందించాలని నిర్ణయించారు అధికారులు.

ఇక మియాపూర్ – పటాన్ చెరువు మెట్రో కారిడార్ 13 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ మీడియంలో మెట్రో పనులు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మదీనగూడ వద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్లాన్‎ను జాతీయ రహదారుల సంస్థ, మెట్రో అధికారులు కలిసి నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు. అలాగే నాగోల్ – ఎల్బీనగర్ – శంషాబాద్ ఎయిర్‎పోర్టు మెట్రో కారిడార్ మార్గాన్ని సైతం జాతీయ రహదారుల సంస్థ అధికారులతో పర్యటించి అవసరమైన ప్రాంతాల్లో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించారు. దీంతో హైదరాబాద్ చుట్టుపక్కల అవుటర్ రింగురోడ్డు ప్రాంతమంతా ఎటు చూసినా మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతంగా, సుఖవంతమైన జర్నీ చేసేందుకు వీలుంటుందని చెప్పవచ్చు. అంతేకాకుండా నగరంలో ఇప్పటికే ట్రాఫిక్ సమస్య మెట్రో కారణంగా కొంత మేర తగ్గింది. ఈ ప్రాంతాల్లో మెట్రో అనుసంధానం చేస్తే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ సమస్యలను అధిగమించినట్లవుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…