Karimnagar: కూలీలు తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ 2 మట్టి కుండలు.. ఓపెన్ చేయగా

|

Mar 26, 2023 | 11:06 AM

దొరికిన నాణేల పంపకంలో కూలీల మధ్య వివాదం చెలరేగింది. విషయం బయటకు పొక్కడంతో అధికారులు రంగప్రవేశం చేశారు.

Karimnagar: కూలీలు తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ 2 మట్టి కుండలు.. ఓపెన్ చేయగా
Nizam Era Silver Coins
Follow us on

క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామి పని కూలీలు.. ఇదే గ్రామంలోని పాత ఊరు వద్ద చేపల చెరువు కోసం గుంత తవ్వుతుండగా 27 వెండి నాణేలు బయటపడ్డాయి. 3 రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. దీంతో కూలీలు తలా కొన్ని తీసుకుని.. వాటిని ఇళ్లకు తీసుకెళ్లారు.

వార్త కోడై కూసింది. నిజం గడప దాటేలోపు.. అబద్దం ఊరంతా చుట్టి వస్తుందన్న సామెత చందంగా గుప్తునిధులు, బంగారు నగలు జరిగాయన్న ప్రచారం హోరెత్తింది. ఈ సమయంలోనే నాణేల పంపకం విషయంలో వివాదం రేగింది. దీంతో విషయం అధికారుల వరకు వెళ్లింది. స్థానిక తహశీల్దార్.. పోలీసులను వెంటబెట్టుకుని గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఖాకీలను చూసి భయపడ్డ కూలీలు.. తమకు దొరికిన నాణేలు అన్నీ ఇచ్చేశారు.  రెండు మట్టి కుండల్లో మొత్తం 27 వెండి నాణేలు లభించినట్లు కార్మికులు తహశీల్దార్‌కు వెల్లడించారు. అధికారులు ఆ కాయిన్స్ సీజ్ చేసి.. పంచానామా నిర్వహించారు. ఒక్కో నాణెం తులం బరువు ఉన్నట్లు తేల్చారు.  మీర్ మహబూబ్ అలీ నవాబ్ ఖాన్ హయాంలో 1869 నుంచి 1911 వరకు ఈ నాణేలు చెలామణిలో ఉన్నాయని పురావస్తు శాఖ వెల్లడించింది.

అయితే గతంలో కూడా ఈ ప్రాంతాల్లో పొలాలు చదును చేస్తుండగా, వ్యవసాయం పనులు చేస్తుండగా పలువురికి ఇలాంటి నాణేలు దొరికాయ‌ని గ్రామస్థులు చెబుతున్నారు. స్థానిక తాసిల్దార్ కనకయ్య, ఎస్‌ఐ ప్రమోద్‌రెడ్డి, ఎంపీడీఓ రవీందర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఐ అనిల్‌లు ఈ వివరాలు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..