Watch Video: ఫుడ్ డెలివరీ బాయ్ సేవలు అదుర్స్.. ఆ సాహసానికి ప్రశంసలు..

| Edited By: Srikar T

Jul 15, 2024 | 8:40 PM

హైద‌రాబాద్‌ అంతటా భారీ వర్షం కురుస్తోంది. దీంతో అనేక మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. కావాల్సిన ఫుడ్‌ని యాప్స్‌లో ఆర్డర్‌ చేసుకుని మరీ ఇంటికి తెప్పించుకుంటున్నారు. అంతా బాగానే ఉన్నా అంతటి వర్షంలో ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ పడే కష్టం అంతా ఇంతా కాదు. ఓ వైపు భారీ వర్షం, మరోవైపు ట్రాఫిక్‌ జామ్‌తో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

Watch Video: ఫుడ్ డెలివరీ బాయ్ సేవలు అదుర్స్.. ఆ సాహసానికి ప్రశంసలు..
Zomato
Follow us on

హైద‌రాబాద్‌ అంతటా భారీ వర్షం కురుస్తోంది. దీంతో అనేక మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. కావాల్సిన ఫుడ్‌ని యాప్స్‌లో ఆర్డర్‌ చేసుకుని మరీ ఇంటికి తెప్పించుకుంటున్నారు. అంతా బాగానే ఉన్నా అంతటి వర్షంలో ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ పడే కష్టం అంతా ఇంతా కాదు. ఓ వైపు భారీ వర్షం, మరోవైపు ట్రాఫిక్‌ జామ్‌తో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప‌లు కాల‌నీలు జ‌ల‌మ‌యం కావ‌డం, రోడ్లపై వ‌ర‌ద నీరు నిలిచిపోవడంతో డెలివ‌రీ బాయ్స్ అవ‌స్థలు ప‌డుతున్నారు. ఫుడ్‌ డెలివరీ చేసేందుకు ఓ డెలివరీ బాయ్‌ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బయలుదేరిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కస్టమర్లకు సేవలందించేందుకు నడుముల్లోతు నీళ్లలో చేసిన సాహసం చూసినవారంతా అభినందనలతో మెచ్చుకుంటున్నారు.

వర్షమైనా, వరదలొచ్చినా తగ్గేదేలే అంటూ రెయిన్‌కోట్‌ వేసుకుని ఫుడ్‌ని భద్రంగా తీసుకెళ్లి కస్టమర్లకు అందిస్తున్న డెలివరీ బాయ్‌ని అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా, నడుము లోతు నీళ్లలో ఆనందంగా నడుచుకుంటూ వెళ్తూ ఫుడ్‌ డెలివరీ చేశాడు. ఇతను నిజమైన సూపర్‌ హీరో అంటూ పలువురు కొనియాడుతున్నారు. భారీ వరదల్లో కూడా పనిపట్ల అతనికి ఉన్న గౌరవం, అంకితభావానికి హ్యాట్సాఫ్ అంటున్నారు. కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం వర్షం వచ్చేప్పుడు ఇలాంటి సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు. వర్షపు నీటిలో ఇలా వెళ్లడం ప్రమాదం అంటూ హెచ్చరిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..