Tiger Dead: పులుల మరణాలపై వీడని మిస్టరీ.. దర్యాప్తు చేపట్టిన కేంద్ర బలగాలు..

|

Jan 09, 2024 | 10:15 AM

తెలంగాణలో వరుస పులుల మరణాలు కలవరపెడుతున్నాయి. అరుదైన వన్యప్రాణులను సంరక్షించాల్సిన అటవీ శాఖ ఈ ఘటనపై మౌనం వహిస్తోంది. కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ కారిడార్ దరిగాం అటవీ ప్రాంతంలోని గొందిలో రెండు పులులు మృతి చెందాయి. డిసెంబర్ 27 న పశువుపై పులి దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు అధికారులు. ఆ పశువు మాంసం తిన్న ఎస్ 16 అనే అడపులి వారం రోజుల తరువాత మరణించింది.

Tiger Dead: పులుల మరణాలపై వీడని మిస్టరీ.. దర్యాప్తు చేపట్టిన కేంద్ర బలగాలు..
Tiger Death Mystery
Follow us on

తెలంగాణలో వరుస పులుల మరణాలు కలవరపెడుతున్నాయి. అరుదైన వన్యప్రాణులను సంరక్షించాల్సిన అటవీ శాఖ ఈ ఘటనపై మౌనం వహిస్తోంది. కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ కారిడార్ దరిగాం అటవీ ప్రాంతంలోని గొందిలో రెండు పులులు మృతి చెందాయి. డిసెంబర్ 27 న పశువుపై పులి దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు అధికారులు. ఆ పశువు మాంసం తిన్న ఎస్ 16 అనే అడపులి వారం రోజుల తరువాత మరణించింది. అదే స్థలంలో ఎస్ 9 అనే మగ పులి మృత్యువాత పడటం తీవ్ర చర్చనీయాంశమైంది. పులులు మృతి చెందిన ప్రాంతానికి కూతవేడు దూరంలో పశువు కళేబరాన్ని గుర్తించారు అధికారులు. అయితే పశువు కళేబరం ఉన్న ప్రాంతాన్ని పరిశీలించేందుకు రంగంలోకి దిగారు నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ సిబ్బంది. టెరిటోరియల్ ఫైట్ జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో పులుల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పులిదాడిలో పశువు మృతి చెందడంతో విషప్రయోగం జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే రెండ పులు మృతిపై అటవీశాఖ అధికారులు నోరు మెదపడం లేదు.

ఎన్డీసీఏ అధికారులు దర్యాప్తులో పులుల తలకు బలమైన గాయలు ఉన్నట్లు గుర్తించారు. పైగా పులి కాళ్లు విరగడంతో పశువుకు, పులికి మధ్య జరిగిన ఆధిపత్యపోరా.. లేకా ఎవరైనా కావాలని కొట్టి చంపారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం ఈ గాయాలకు సంబంధించి ఎలాంటి వీడియో ట్రాక్ కెమెరాల్లో రికార్డ్ కాలేదు. మొదటి పులి మరణించిన 300 మీటర్ల దూరంలోని కొమురం భీం కాలువలో పడి ఎస్ 9 మగ పులి చనిపోయింది. మగ పులికి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు పశువైద్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇదే క్రమంలో కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ శాంతారాంతోపాటు కొమురం భీం జిల్లా డీఎఫ్ వో నీరజ్ అతని బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని గమనిస్తున్నారు. దీనిపై కేంద్ర బలగాలు క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతోంది. అయితే ఈ పులులు సహజంగానే మరణించాయా.. లేక ఎవరైనా దాడికి పాల్పడ్డారా అన్న మిస్టరీ వీడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..